నీకెంత..నాకెంత..వరంగల్ లో పెరుగుతున్నసెటిల్మెంట్ దందా

  • భూముల ధరలకు రెక్కలు రావడంతో పెరిగిన వివాదాలు
  • బలహీనులు, స్థానికంగా లేనివారే టార్గెట్‌
  • అన్నీ నేతల కనుసన్నల్లోనే

వరంగల్​ క్రైం, వెలుగు: సిటీలో ప్రైమ్​లొకేషన్​లో వంద గజాల భూమి రూ.30 నుంచి 40 లక్షలు పలుకుతుంది. అది వివాదస్పద భూమైతే వారికి వరంగా మారుతుంది. సెటిల్​మెంట్​ చేస్తే లక్షల్లో పర్సంటేజీలు.. ఈజీ మనీ సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న కొంతమందికి ఇటువంటి భూ దందాలు అక్షయపాత్రలా కనిపిస్తున్నాయి. ఒక భూదందాలో దూరితే చాలు సెటిల్​చేస్తే లక్షల్లో వాటాలు.. పోలీసులు, ఉద్యోగులు, నాయకులు, రౌడీషీటర్లు, రియల్టర్లు, వారి అనుచరులు ఇలా ఒకరేమిటీ అందరు సెటిల్​మెంట్లలో మునిగితేలుతున్నవారే.

పెరిగిన ఫిర్యాదులు

గతంలో భూవివాదం తలెత్తితే అసలు యజమాని కోర్టుకు వెళ్లేవారు. ధనబలం.. రాజకీయ పలుకుబడితో  భూకబ్జాలు చేస్తుండడంతో బాధితులు సత్వరమే న్యాయం కోరుతూ పోలీస్​ స్టేషన్లను, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ న్యాయం దొరుకుతుందా అంటే.. అక్కడికి బాధితుల కంటే ముందే కబ్జాదారులు చేరుతున్నారు. కోర్టు, రెవెన్యూ కోర్టుకు వెళ్లినా కూడా సంవత్సరాల కొద్దీ సమయం పడుతుందని బాధితుల్లో ఎక్కువ మంది పోలీసులు, నేతల అనుచరులు, రౌడీషీటర్ల వద్దకే భూ పత్రాలను పట్టుకుని వెళ్తున్నారు. దీంతో పోలీస్​స్టేషన్లకు ఎక్కువగా భూ ఆక్రమణల కేసులపైనే ఫిర్యాదులు వస్తున్నాయి.

జిల్లాల విభజన తర్వాత..

ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో వరంగల్​సిటీలో భూముల రేట్లు పెద్దగా పెరగలేదు. వరంగల్​ జిల్లాను, జయశంకర్​ భూపాలపల్లి, వరంగల్​అర్బన్​, రూరల్, జనగామ, మహబూబాబాద్, ములుగుతో ఆరు జిల్లాలుగా మారింది. విభజన తర్వాత వరంగల్​సిటీకి మరింత క్రేజ్​పెరిగింది. ఉమ్మడి జిల్లాలో కేవలం డివిజన్​కేంద్రాలుగా ఉన్న పట్టణాలన్నీ జిల్లా కేంద్రాలయ్యాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు, వ్యాపారస్తులకు వరంగల్​అంటే ఒక క్రేజ్​ఏర్పడింది. రవాణా, విద్య, వైద్య, వాణిజ్యం అన్ని అందుబాటులో ఉంటాయని ఇక్కడ ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. వరంగల్లో నివాసిత స్థలాలకు ధరలు పెరగడం… డిమాండ్​ఉండడంతో ఎక్కడో ఉంటూ ఇక్కడ భూములు కొనుగోలు చేసే వారి స్థలాలే టార్గెట్​గా కొంతమంది కబ్జాలు చేస్తున్నారు.

కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కబ్జాలు, భూదందాలు పెరిగినట్లు నగర పోలీస్​కమిషనర్​గుర్తించారు. ఇటువంటి వారి ఆట కట్టించేందుకు ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్​ఏర్పాటు చేశారు. పోలీస్​ఆఫీసర్లు భూదందాల్లో మునిగి తేలుతున్నట్లు గ్రహించి ఆధారాలు ఉన్నవారిని గతంలో సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కబ్జాలు వారు నేతల అనుచరులు కావడంతో ఒక్కోసారి పోలీస్​ కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.