నైట్ విజన్​ గాగుల్స్​తో విమానం ల్యాండ్​

నైట్ విజన్​ గాగుల్స్​తో విమానం ల్యాండ్​
  • తొలిసారి విజయవంతంగా నిర్వహించిన మన ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ (ఐఏఎఫ్​)​ మరో అరుదైన ఘనత సాధించింది. తొలిసారి నైట్​విజన్​ గాగుల్స్ (ఎన్​వీజీ)​ సాయంతో విమానాన్ని సక్సెస్​ఫుల్​గా ల్యాండ్​ చేసింది. ఈస్టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అడ్వాన్స్డ్​ ల్యాండింగ్​ గ్రౌండ్​లో నైట్ విజన్​లో ఐఏఎఫ్ సీ-130జే విమానాన్ని విజయవంతంగా ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్టు అధికారులు ట్విట్టర్​ (ఎక్స్)లో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ఐఏఎఫ్​ పోస్ట్​ చేసింది. మొదటి వీడియోలో ఎన్​వీజీ టెక్నాలజీతో ఎయిర్​క్రాఫ్ట్​ స్మూత్​ ల్యాండింగ్​అయినట్టు కనిపించింది.

రెండో క్లిప్​లో విమానం కిటికీ లోపలి దృశ్యాలను చూపించింది. ఈ రెండు క్లిప్​లు నైట్ విజన్ కు సంబంధించినవి అయినందున గ్రీన్​ కలర్​లో ఉన్నాయి. ‘‘ఎన్​వీజీ సాంకేతికతను ఉపయోగించి ఇప్పుడు ఐఏఎఫ్​ తక్కువ కాంతి పరిస్థితుల్లో సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన కార్యకలాపాలను నిర్వహించగలదు. ఇది రాత్రిపూట మిషన్లను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది”అని ఐఏఎఫ్​ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో కార్గిల్​ ఎయిర్​స్ట్రిప్​లో ఇదే విమానం(సీ130జే)ను ఐఏఎఫ్​ సేఫ్​ ల్యాండింగ్​ చేసింది.