పొలాలకు వెళ్లే దారి కబ్జా

తిమ్మాపూర్, వెలుగు: తిమ్మాపూర్​ మండలం పోరండ్ల గ్రామంలో పొలాలకు వెళ్లే దారిని గ్రామానికి చెందిన ఓ మహిళ కబ్జా చేసి, ఇంటిని నిర్మిస్తోంది. ఈ విషయమై పలుమార్లు అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కొన్నేండ్ల కింద ఈ దారి వెడల్పుగా ట్రాక్టర్లు, ఎండ్ల బండ్లు పోయేలాగా ఉండగా, కబ్జాతో ఇప్పుడు ఇరుగ్గా మారింది. పక్కనే కరెంట్​ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్​ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయపడుతున్నారు.