భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను మేఘన (25), లక్ష్మీ (49), అన్నపూర్ణ (55), లాలు ( 48) గా గుర్తించారు.
భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను మేఘన (25), లక్ష్మీ (49), అన్నపూర్ణ (55) లాలు ( 48) గా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న అతని మృతదేహాన్ని తీసేలోపు కొండచరియలు మళ్లీ విరిగిపడ్డాయి. దీంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
ALSO READ | విజయవాడలో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి..
ఇప్పటివరకు కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కొండచరియలు విరిగిపడిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత బాధిత కుటుంబాలను పరిమర్శించి.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.