చంద్రయాన్ 3 : వంద మీటర్ల జర్నీ కంప్లీట్ చేసిన ప్రజ్ణా రోవర్

చంద్రయాన్ 3 : వంద మీటర్ల జర్నీ కంప్లీట్ చేసిన ప్రజ్ణా రోవర్

చంద్రయాన్ 3 కి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక అప్డేట్ ఇచ్చింది.  మిషన్‌లో భాగమైన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్లు విజయవంతంగా ప్రయాణించింది. ఈ మేరకు ఇస్రో  ట్వీట్ చేసింది.  

ఆదిత్య ఎల్‌1 మిష‌న్ స‌క్సెస్ అయిన త‌ర్వాత ఇస్రో ఈ విషయాన్ని వెల్లడించింది. చంద్రయాన్‌-3కి చెందిన అన్ని ప‌రిక‌రాలు స‌వ్యంగా ప‌నిచేస్తున్నాయని, ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌లు ఇంకా ఫంక్షన్ చేస్తున్నాయ‌ని తెలిపింది.  రోవ‌ర్ పంపిన డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయ‌నం చేస్తున్నట్లుగా వెల్లడించింది.