Cyclone Dana Effect: దానా తుఫాన్ ఎఫెక్ట్..ఒడిశా, వెస్ట్ బెంగాల్లో హైఅలెర్ట్..స్కూళ్లు బంద్, విమానాలు రద్దు

Cyclone Dana Effect: దానా తుఫాన్ ఎఫెక్ట్..ఒడిశా, వెస్ట్ బెంగాల్లో హైఅలెర్ట్..స్కూళ్లు బంద్,  విమానాలు రద్దు

దానా తుఫాన్ కారణంగా ఒడిశా, వెస్ట్ బెంగాల్ లలో భారీ వర్షాలు పడుతున్నాయి. దానా తుఫాను తీరం దాటే క్రమంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వెస్ట్ బెంగాల్, ఒడిశాలో తుఫాను ఎఫెక్ట్ భారీగా ఉన్నందున పలు విమానాలను రద్దు చేశారు. 

అక్టోబర్ 24 అర్థరాత్రి 25 ఉదయం వరకు 100 కిమీ వేగంతో దానా తుఫానుగా మారి వాయువ్యదిశగా కదులుతుందని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను పూరీ సాగర్ ద్వీపం మధ్య భితార్కానికి, ఢమారా దగ్గర కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది గంటలకు 110 కిలోమీటరల వే గంతో దూసు కుపోతుంది. 

Also Read :- రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

దానా తుఫాన్ ప్రభావంతో ఒడిశా ప్రభుత్వం హైఅలెర్ట్  ప్రకటించింది. అధిక ప్రభావం ఉన్న 14 జిల్లాల్లో పాఠశాలలు మూసివేసింది. గంజాం, పూరి, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపరా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్ మరియు కటక్ జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు. భద్రక్, ధామ్రా జిల్లా్లో బలమైన ఈదురుగాలులతో గురువారం ( అక్టోబర్ 24) ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. అప్రమత్తమైన అధికారులు భద్రక్ లోని తుఫాను షెల్టరలకు ప్రజలను తరలిస్తున్నారు. దానా తుఫాను ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. 

మరోవైపు పశ్చిమ బెంగాల్ లో 9జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో దక్సిణ పరగణాలు, ఉత్తర పరగణాలు , పుర్బా మేదీనీపూర్, పశ్చిమ్ మెదినీపూర్ ఘర్ గ్రామ్, ంకురా, హుగ్లీ, హౌరా, కోలకతా  జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందును అక్టోబర్ 24నుంచి 26 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.