భద్రాచలం,వెలుగు: తెలంగాణ– చత్తీస్గఢ్ సరిహద్దులోని భద్రాచలం డివిజన్చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో సోమవారం మందుపాతర్లను పోలీసులు వెలికితీశారు. సీఆర్పీఎఫ్81 బెటాలియన్జవాన్ల తనిఖీల్లో భాగంగా వీటిని కనిపెట్టారు.
పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మూడు చోట్ల ఏర్పాటు చేసిన మందుపాతర్లను గుర్తించి వెంటనే బాంబు స్వ్కాడ్ను రప్పించి నిర్వీర్యం చేశారు. ఇటీవల ఇక్కడి బేస్క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జరిపినది విషయం తెలిసిందే. చర్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. కూంబింగ్ఆపరేషన్ ముమ్మరం చేశారు.