ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిలో ..ఆస్ట్రేలియన్ జీపీ విన్నర్ నోరిస్‌‌

ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిలో ..ఆస్ట్రేలియన్ జీపీ విన్నర్ నోరిస్‌‌

మెల్‌‌బోర్న్: ఫార్ములా వన్ సీజన్ తొలి రేసు అయిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిలో మెక్‌‌లారెన్‌‌ డ్రైవర్ లాండో నోరిస్‌‌ టైటిల్ నెగ్గాడు. ఆదివారం వర్షం  ప్రభావంతో పలు ప్రమాదాలు జరిగిన ఫైనల్లో పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన నోరిస్‌‌ గంటా 37 నిమిషాల 28.905 సెకండ్లతో అందరికంటే ముందుగా పూర్తి చేశాడు.

ఫెరారీ తరఫున అరంగేట్రం చేసిన లెజెండరీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌‌ పదో స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచాడు. రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్‌‌స్టాపెన్ ( +0.895 సె) రన్నరప్‌‌గా నిలవగా.. మెర్సిడెస్‌‌కు చెందిన జార్జ్ రస్సెల్ (+5.327 సె) మూడో స్థానం సాధించాడు.