విజయవాడలో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి..

ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో బాలిక మృతి చెందింది. మొగల్రాజపురం సెంటర్ దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనలో కొన్ని ఇళ్లు పూర్తిగా దెబ్బతిని ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇళ్లలో పలువురు చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

శిధిలాల కింద తొమ్మిది మంది చిక్కుకోగా ఆరుగురిని వెలికితీసి చికిత్స అందిస్తుంన్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేసారు సహాయక సిబ్బంది. కాగా.. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడ్డ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు అధికారులు.
 

Also Read :- విజయవాడ వెళుతున్నారా