తిరుమలలో కుండపోత వాన : కొండ రాళ్లు విరిగి పడ్డాయి..

తిరుమలలో కుండపోత వాన : కొండ రాళ్లు విరిగి పడ్డాయి..

తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలం అయ్యింది. బుధవారం 
( అక్టోబర్ 16,2024 ) రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.వినాయక స్వామి గుడి తర్వాత రెండవ మలుపు దగ్గర రోడ్డుపై బండరాళ్లు పడ్డాయి.వెంటనే అప్రమత్తమైన టిటిడి అధికారులు యుద్ద ప్రాతిపదికన బండరాళ్ళను తొలగిస్తున్నారు.

Also Read :- చెన్నైలో 24 గంటలుగా నాన్ స్టాప్ వర్షం

కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రోడ్లలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. 

తిరుమలలో వారం రోజులుగా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు వాయుగుండం ప్రభావంతో.. 24 గంటలుగా.. అంటే అక్టోబర్ 15వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. భారీ వర్షంతో 15వ తేదీ బ్రేక్ దర్శనాలు సైతం రద్దు చేశారు. ఆగకుండా పడుతున్న వర్షంతో తిరుమల కొండపై భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

విమాన, రైళ్ల సర్వీసులపై వర్షం ఎఫెక్ట్ పడింది. చెన్నై నుంచి రావాల్సిన రైళ్లు కొన్ని రద్దు కావటం.. మరికొన్ని సర్వీసులు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తుండటంతో.. తిరుమల భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.