ఉదయం ఐదున్నరకే మెట్రో స్టార్ట్.. మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌ మార్పు

ఉదయం ఐదున్నరకే మెట్రో స్టార్ట్.. మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌  మార్పు

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ సంస్థ స్వల్ప మార్పులు చేసింది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో సర్వీసులు ప్రారంభమై.. రాత్రి 11 గంటల వరకు కొన సాగుతాయని తెలిపింది. అలాగే, ప్రతి శుక్ర వారం ఉదయం 6 గంటలకు సర్వీ సులు ప్రారంభమై.. రాత్రి 11:45 గంటల వరకు కొనసాగుతాయని వెల్లడించింది. మిగిలిన రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే మెట్రో సర్వీసులు అందు బాటులో ఉంటాయని పేర్కొంది. అయితే, ఈ టైమింగ్స్‌‌‌‌‌‌‌‌ తాత్కాలికమేనని, ట్రయల్ రన్ బేస్ మీద చేస్తున్నామని వెల్లడించింది. ప్రయాణికుల స్పందనను బట్టి ఇవే టైమింగ్స్ కొనసాగించాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.