ఏం చేద్దాం అనిరా : హైదరాబాద్ మెట్రో రైలు X అకౌంట్ హ్యాక్

ఏం చేద్దాం అనిరా : హైదరాబాద్ మెట్రో రైలు X అకౌంట్ హ్యాక్

రోజుకు లక్షల మంది ప్రయాణించే వ్యవస్థ హైదరాబాద్ మెట్రో.. ఈ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తోంది. అలాంటి సంస్థ అధికారిక X ( ట్విటర్) అకౌంటే హ్యాక్ చేశారు కొందరు దుండగులు. హైదరాబాద్ మెట్రో రైల్ అఫీషియల్ X అకౌంట్ (@ltmhyd) సెప్టెంబర్ 19న ఉదయం హాక్ అయినట్లు ప్రకటించారు మెట్రో అధికారులు. హ్యాక్ చేసిన వారే స్వయంగా ఇది హ్యాక్ చేసిన అకౌంట్ అంటూ ట్విట్ చేశారు.

క్రిప్టోకరెన్సీ ప్రకటన చేశారు. హ్యాకర్లు క్రిప్టో కరెన్సీ టోకెన్ కొనమని క్రిప్టో వాలెట్ సైట్ అడ్రస్ షేర్ కూడా చేశారు.  దీంతో వెంటనే అప్రమత్తమైన హ్యాకింగ్ ఘటనపై ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.  X అకౌంట్లో వచ్చే ఏ లింక్ లపై క్లిక్ చేయోద్దని సూచించారు మెట్రో అధికారులు. తర్వాత అప్ డేట్ వచ్చేంత వరకు ఆ అకౌంట్ పోస్టులతో జాగ్రత్తగా ఉండాలని కోరింది. 

ట్వీట్‌లో క్రిప్టో కరెన్సీ టోకెన్ చిరునామా ఉంది “ఇప్పుడే కొనండి!” అని హ్యాకర్లు రాసుకొచ్చారు. మెట్రో ప్రయాణీకులను తప్పు దారి పట్టించి క్రిప్టో స్కామ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశారు హ్యాకర్లు. సోషల్ మీడియా వేదికగా ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించారు.

Also Read:-చెప్పులు విడిచి రమ్మన్నందుకు డాక్టర్​పై దాడి