ఇంకో 2 ఏళ్లలో L&T చిప్‌‌‌‌‌‌‌‌ల తయారీ

ఇంకో 2 ఏళ్లలో L&T చిప్‌‌‌‌‌‌‌‌ల తయారీ

న్యూఢిల్లీ: చిప్‌‌‌‌‌‌‌‌ డిజైన్ కంపెనీ ఎల్ అండ్ టీ సెమికండక్టర్ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌ తాను డిజైన్ చేసిన చిప్‌‌‌‌‌‌‌‌లను  ఇంకో రెండేళ్లలో తయారు చేయడం మొదలు పెడతామని ప్రకటించింది. వివిధ సెమికండక్టర్ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌లో రెవెన్యూ 5 కోట్ల డాలర్ల నుంచి 100 కోట్ల డాలర్లకు మధ్య ఉన్నప్పుడు తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఈఓ సందీప్ కుమార్ అన్నారు. 

మొత్తం 15  రకాల చిప్‌‌‌‌‌‌‌‌లను  చూసుకునేందుకు  కంపెనీ టీమ్స్‌‌‌‌‌‌‌‌ను రెడీ చేస్తోందని అన్నారు. ‘ఇంకో ఆరు నెలల్లో మొత్తం టీమ్స్ రెడీ అవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి 15 ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల డిజైన్లను హ్యాండిల్ చేయగలుగుతాం. ఇప్పటికే ఆరు రకాల చిప్‌‌‌‌‌‌‌‌ల డిజైన్స్‌‌‌‌‌‌‌‌ మొదలయ్యాయి. వచ్చే ఏడాది చివరిలో  ఈ డిజైన్స్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేస్తాం. వీటి ప్రొడక్షన్ ఇంకో  2 ఏళ్లలో మొదలవుతుంది’  అని సందీప్  అన్నారు.