న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన సిలికాంచ్ సిస్టమ్స్‌ను రూ. 183 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) మంగళవారం తెలిపింది. ఫ్యాబ్లెస్ సెమీకండక్టర్ వ్యాపారంలో బలపడటానికి ఈ కొనుగోలు ఉపయోగపడుతుందని తెలిపింది.
తమ కంపెనీ పూర్తి యాజమాన్యంలోని పూర్తి అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్ లిమిటెడ్ సిలికాంచ్ సిస్టమ్స్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి జులై 8, 2024న వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఎల్ అండ్‌టీ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. ముగింపు షరతులకు లోబడి సెప్టెంబర్ నాటికి కొనుగోలు పూర్తయ్యే అవకాశం ఉంది. 2016లో ఏర్పడ్డ సిలికాంచ్, సెమీకండక్టర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ , ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లను తయారు చేస్తోంది.