న్యూఢిల్లీ : ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) క్లౌడ్ సేవల సంస్థ ఈ2ఈ నెట్‌వర్క్స్ లిమిటెడ్‌లో 21 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం తెలిపింది. డీల్ విలువ రూ.1,407.02 కోట్లని వెల్లడించింది. క్లౌడ్, ఏఐ సేవలలో ఎల్అండ్టీ పరిధిని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
ఈ2ఈ నెట్‌వర్క్స్ లిమిటెడ్‌లో 21 శాతం వరకు వాటాను కొనుగోలు చేసేందుకు కంపెనీ నవంబర్ 5, 2024న పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఎల్ అండ్ టీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా 15 శాతం వాటా కోసం రూ. 1,079.27 కోట్లు, సెకండరీ కొనుగోలు ద్వారా అదనంగా ఆరు శాతం వాటా కోసం రూ. 327.75 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఫైలింగ్‌లో పేర్కొంది.