హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ సిద్దమవుతోంది. 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టను విక్రయించాలని ఎల్ అండ్ టీ యోచిస్తోంది. మెట్రోలో మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిందని..హైదరాబాద్ లో ఉచిత బస్సు పథకం ప్రభావం దీనిపై ఎక్కువగా ఉందని ఎల్ అండ్ టీ సంస్థ వెల్లడిం చింది. 

మెట్రో ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ వాటా 90 శాతం ఉండగా ప్రభుత్వానికి 10 శాతం ఉంది. మెట్రో వ్యవస్థనునడపడానికి కంపెనీకి 65 ఏళ్ల రాయితీ ఉంది. 

2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను విక్రయించాలని L&T యోచిస్తోందని..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం రైడర్‌షిప్ తో మెట్రోల ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గిందని సంస్థ డైరెక్టర్ ఆర్ శంకర్ రామన్ అన్నారు.

తెలంగాణలో ప్రభుత్వం నాన్-ఏసీ బస్సుల్లో మహిళలు,ట్రాన్స్‌జెండర్లకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని మహాలక్ష్మి బస్సు పథకం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోజుకు 4 లక్షల 80 వేల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తునన్ారని. ప్రస్తుత రైడర్ షిప్ కారణంగా ఈ ప్రాజెక్టుపై భారం పడుతోంది. ఈభారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని శంకర్ రామన్ అన్నారు.