LPL 2024: నేటి నుంచి లంక ప్రీమియర్ లీగ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

LPL 2024: నేటి నుంచి లంక ప్రీమియర్ లీగ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

టీ20 వరల్డ్ కప్ ముగిసిన రెండు రోజులకు క్రికెట్ అభిమానులకు లంక ప్రీమియర్ లీగ్ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. సోమవారం (జూలై 1) నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీ జూలై 1 నుంచి జూలై 21 వరకు జరుగుతుంది. మొత్తం 5 జట్లు పాల్గొంటున్నాయి. కాండీ ఫాల్కన్స్, దంబుల్లా థండర్స్, జాఫ్నా కింగ్స్, గాలే మార్వెల్స్,కొలంబో స్ట్రైకర్స్ లంక ప్రీమియర్ లీగ్ టైటిల్ కోసం తలబడతాయి.  

సోమవారం (జూలై 1) ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ క్యాండీ ఫాల్కన్స్ తో దంబుల్లా సిక్సర్‌ల తలపడనుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్,బంగ్లాదేశ్ ఆటగాళ్లతో ఈ లీగ్ ఫ్యాన్స్ కిక్ ఇవ్వనుంది.మొత్తం ఐదు జట్లు మిగిలిన నాలుగు జట్లతో రెండు మ్యాచ్ లాడతాయి. క్యాండీ, దంబుల్లా, కొలంబోలను వేదికలుగా నిర్ణయించారు. 

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

లంక ప్రీమియర్ లీగ్ జూలై 1 నుండి 21 వరకు జరగనుంది. ఇందులో భాగంగా మొత్తం 24 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియాలో టీవీల్లో ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడుతుంది.  ఫోన్ లో లైవ్ చూడాలనుకుంటే ఫ్యాన్‌కోడ్ యాప్ లో వస్తుంది. రెండు మ్యాచ్ లు ఉంటే మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు.. రెండో మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది.