కిడ్నాపైన యువకుని కథ సుఖాంతం

సరూర్ నగర్లో కిడ్నాపైన యువకుని కథ సుఖాంతమైంది. నల్లగొండ జిల్లా చింతపల్లి వద్ద అతని ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపైన లంకా సుబ్రహ్మణ్యంను సొంత బాబాయ్ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తరలించారు. కుటుంబ కలహాలు కిడ్నాప్ నకు కారణమై ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో లంకా లక్ష్మీ నారాయణ కుటుంబంతో ఉంటున్నాడు. ఆయన రెండో కుమారుడు లంకా సుబ్రహ్మణ్యం రాత్రి 12.45గంటల సమయంలో ఇంటి బయట తిరుగుతుండగా.. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న కొందరు యువకులు కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న సరూర్ నగర్ పోలీసులు గాలింపు చేపట్టారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ ఉదంతాన్ని చేధించారు.