
మెదక్టౌన్, వెలుగు:మెదక్ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలపనలు చేయగా పాస్టర్లు దైవసందేశాన్ని అందించి దీవించారు. చర్చిలో భౌతిక దూరం పాటించేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు చెట్ల కింద టెంట్లు వేసుకొని వంటలు వండుకొని సందడిగా గడిపారు.