సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదానం

సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదానం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్​ టౌన్​ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టను సోమవారం పెద్ద ఎత్తున భక్తులు సందర్శించారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం నుంచి జీవ కోనేరు వరకు ఉత్సవ మూర్తులతో పల్లకి సేవ నిర్వహించారు.పల్లకి సేవ ముందు భక్తులు భజన గీతాలు పాడుతూ ఆకట్టుకున్నారు. అనంతరం వన్నెల్​బి గ్రామానికి చెందిన ఏనుగు లతిక రాజేశ్వర్​ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.