ఖమ్మంలో వికలాంగులకు సదరం అవస్థలు

ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన సదరం క్యాంపునకు వికలాంగులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం 6 గంటల నుంచే గవర్నమెంట్​హాస్పిటల్ ముందు క్యూ కట్టారు. అధికారులు ఉదయం 10 గంటలకు క్యాంప్ ప్రారంభించగా, అప్పటి వరకు క్యూలైన్లలోనే నిల్చొని నిరీక్షించారు. ముందస్తుగా వికలాంగులు కూర్చునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.

సమస్యను బట్టి ఏ రూమ్​కు వెళ్లాలో అధికారులు ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో అంధులు, చెవిటి, మూగ, మానసిక వికలాంగులు అవస్థలు పడ్డారు. క్యాంప్​వద్ద కనీసం మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయలేదని కొందరు వాపోయారు.

 వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం