- ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
- వినతులు స్వీకరించిన కలెక్టర్లు, అధికారులు
కాశీబుగ్గ(కార్పొరేషన్)/ హనుమకొండ కలెక్టరేట్/ జనగామ అర్బన్/ ములుగు : కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలను అందజేశారు. వరంగల్బల్దియా హెడ్ఆఫీస్లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై 79 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో కలిసి 139 అర్జీలు స్వీకరించారు.
జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్రిజ్వాన్బాషా షేక్స్టేషన్ఘన్పూర్ఆర్డీవో వెంకన్నతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 130 వినతులు వచ్చాయని కలెక్టర్‌తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి ఫీల్డ్లెవల్సందర్శన తప్పనిసరని, ఆఫీసర్లందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ములుగు కలెక్టరేట్లో కలెక్టర్దివాకర అడిషనల్ఇన్చార్జి కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డితో కలిసి 73 దరఖాస్తులు స్వీకరించారు.
పోషకాహారలోపం ఉన్న పిల్లలను గుర్తించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర సూచించారు. వైద్యాఆరోగ్య శాఖ. శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పోషకాహారం పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు స్టేట్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ నర్సింహరావు పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారికి అందించాల్సిన పోషకాహార చికిత్సను వివరించారు.
యూనివర్సిటీకి సోమనాథుడి పేరే పెట్టాలి
పాలకుర్తి: తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి పేరే పెట్టాలని సోమనాథ కళాపీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక, ప్రజావాణిలో పాలకుర్తి తహసీల్దార్ కు విజ్ఞప్తి చేసింది. జనగామ జిల్లా పాలకుర్తి తహసీల్దార్ఆఫీసులో ప్రజావాణిలో భాగంగా తహసీల్దార్శ్రీనివాస్కి సోమనాథ కళా పీఠం అధ్యక్షుడు డా.రాపోలు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు డా.మార్గం లక్ష్మీ నారాయణ, వివిధ పార్టీల నాయకులు వినతి పత్రాన్ని అందజేసి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని పున: సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలు పరిష్కరించాలి
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమడ్ల శివారు చింతకుంట తండాలోని పలు సమస్యలు తీర్చాలని హతీరాం సేవ యూత్ సభ్యులు గ్రీవెన్స్‌లో కలెక్టర్ సత్యశారదకు వినతి పత్రం అందజేశారు. రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నదని, వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
కొడుకులకు పంచిన భూమి ఇప్పించండి
శాయంపేట: వృద్ధాప్యంలో ఉన్న తమను కొడుకులు పట్టించుకోవడం లేదని, వారికి పంచిఇచ్చిన భూమిని ఇప్పిస్తే తమ బతుకేదో తాము బతుకుతామని వృద్ధదంపతులు హనుమకొండ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శాయంపేట మండలం పెద్దకొడెపాకకు చెందిన చెక్క చంద్రయ్య, చెక్క సారమ్మలకు ముగ్గురు కుమారులు భద్రయ్య, దామోదర్, ప్రసాద్, ఒక కుమార్తె ఉన్నారు.
వారికి ఉన్న 10.05 ఎకరాల పొలాన్ని, మూడు గుంటల్లో నిర్మించిన ఇల్లు, పరకాలలో మూడుగుంటల్లో కట్టిన ఇల్లును ముగ్గురు కొడుకులకు సమానంగా పంచారు. గ్రామంలో షెడ్డు వేసుకొని జీవిస్తున్నామని, తమ వృద్ధాప్యంలో కొడుకులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.