చెర్నోబిల్ ప్లాంట్ నుంచి భారీ స్థాయిలో రేడియేషన్

చెర్నోబిల్ ప్లాంట్ నుంచి భారీ స్థాయిలో రేడియేషన్

ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ ప్లాంట్ నుంచి భారీ స్థాయిలో రేడియేషన్ విడుదలవుతోందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరించింది. చెర్నోబిల్ ప్లాంట్ ను గతంలోనే రష్యా సేనలు ఆధీనంలోకి తీసుకున్నాయి. చెర్నోబిల్ లో రేడియేషన్ లెవల్స్ అసాధారణంగా ఉన్నాయని చెప్పింది. రష్యా బలగాలు భారీ పరికరాలను ఇక్కడకు తరలిస్తూ.. రేడియేషన్ లెవల్స్ ను పెంచుతున్నారని వెల్లడించింది. ప్రతిరోజూ చెర్నోబిల్ ప్లాంట్ పరిస్థితులను అంచనా వేస్తున్నామని, ఇవి అత్యంత ప్రమాదకరంగా మారాయని IAEA డైరెక్టర్ రాఫేల్ గ్రోస్సీ చెప్పారు. న్యూక్లియర్ ప్లాంట్ చుట్టూ ఉన్న డెడ్ జోన్ లోపలికి రష్యా బలగాలు ట్యాంకర్లతో వెళ్లడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. భారీగా సైనిక కదలికలతోనే.. రేడియేషన్ లెవల్స్ పెరిగాయని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఏ వర్గానికి బీజేపీ మేలు చేయలేదు

నేనడిగే 21 ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి