![బెల్ట్ షాపులు ప్రాణాలు తీస్తున్నాయ్.. బంద్ చేయాలని మహిళల భారీ ర్యాలీ](https://static.v6velugu.com/uploads/2025/02/large-scale-rally-held-to-shut-down-belt-shops-in-aepur-village-of-chityala-in-telangana_ElomqueIPk.jpg)
నల్లగొండ:బెల్ట్ షాపులపై యుద్దం ప్రకటించారు ఆ గ్రామ మహిళలు. గ్రామంలో యువకులు, వృద్దులు అనే తేడా లేకుండా ఫుల్లుగా తాగి ప్రమాదాల బారిన పడుతు న్నారని ఆగ్రహించారు. బెల్ట్ షాపుల వల్ల ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులు బంద్ చేస్తే ఊరు బాగుపడుతుందని పోరాటానికి సిద్దమయ్యారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు.
ఏపూర్ గ్రామంలో ఇటీవల ఓ యువకుడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. యాక్సిడెంట్కు కారణం మద్యం మత్తేనని..గ్రామంలో బెల్ట్ షాపుల యువత మత్తులో జోగుతున్నారని.. బెల్ట్ షాపులు మూసివేస్తే గ్రామం బాగుపడుందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలోని మహిళలు, యువకులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
Also Read :- ఈ ఐదుగురు చేసిన ర్యాగింగ్ వింటే.. కొట్టి కొట్టి చంపుతారు.. !
ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కూడా బెల్ట్ షాపులను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా బెల్ట్ షాపులు బంద్ కావాలన్నారు. గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను మూసివేస్తేనే అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎందరో మహిళాలు కోరిన మాట ప్రకారమే ఈ బెల్ట్ షాపుల మూసివేత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.