
- బర్రెను చంపి తిన్నట్టు గుర్తించిన గ్రామస్తులు
- పులి పాద ముద్రలను సేకరించిన ఫారెస్ట్ అధికారులు
జైపూర్(భీమారం)వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ అటవీ బీట్ పరిధిలో పెద్ద పులి మకాం వేసింది. మేతకు వెళ్లిన బర్రె పై దాడి చేసి చంపింది. గురువారం కళేబరాన్ని చూసిన స్థానికులు అటవీ అధికారులు సమాచారం అందించారు. మంచిర్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావు సిబ్బందితో వెళ్లి పెద్దపులి పాద ముద్రలను గుర్తించినట్లు తెలిపారు.
చనిపోయిన బర్రెను అదే గ్రామానికి చెందిన మేకల బాపుదిగా గుర్తించారు. స్థానిక గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. పశువులు, మేకలను అడవిలోకి తీసుకెళ్లొద్దని సూచించారు. దాంపూర్ అటవీలోనే పులి సంచరిస్తున్నట్లు, ప్రజలు ఆందోళన చెందొద్దని తెలిపారు.