ఆసియాలోనే అతిపెద్ద చర్చి ప్రారంభం

ఆసియాలోనే అతిపెద్ద చర్చి ప్రారంభం

ధర్మసాగర్, వెలుగు : ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా నిర్మించిన  క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరాన్ని వ్యవస్థాపకుడు బ్రదర్​ పాల్సన్ రాజ్ గురువారం ప్రారంభించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో భక్తులే భాగస్వాములై చర్చి నిర్మించారు. ఉదయం 7గంటలకు పాల్సన్ రాజ్ ఆధ్వర్యంలో కరుణాపురం గ్రామంలో వేలాదిమంది భక్తులతో ఊరేగింపు నిర్వహించారు.  క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరం జెండా ఆవిష్కరించారు.  అనంతరం దేవాలయ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ తలుపులు తెరిచిన తర్వాత గోపు జయ ప్రకాశ్​కు మొదటి ఆశీర్వాదం అందించారు.  ఓపెనింగ్​లో  స్టేషన్ ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్య,  వివిధ దేశాల పాస్టర్లు,  వేలాది భక్తులు  పాల్గొన్నారు.  ఇప్పటివరకు ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నాగాలాండ్ రాష్ట్రంలోని జున్ హెబోటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చి రికార్డుల్లో ఉండేది.  ఇక నుంచి దాని ప్లేస్​లోకి కరుణాపురం చర్చి చేరనుంది. నాగాలాండ్  చర్చిలో  ఒకే టైంలో 8,500మంది మాత్రమే ప్రార్థన చేసుకునేందుకు వీలు ఉంటుంది.  కానీ క్రీస్తుజ్యోతి ప్రార్థనామందిరంలో  40 వేలమంది ప్రార్థన చేసుకోవచ్చు.