ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక మొదటిసారిగా మంగళవారం (ఫిబ్రవరి 6) తెల్లవారుజామున మెక్సికో చేరుకుంది. మెక్సికోలోని తూర్పు రాష్ట్రమైన క్వింటానా రూ నౌకాశ్రయాన్ని చేరింది. మెక్సికో అందాలను ఆస్వాదించేందుకు ప్రయాణికులు ఓడనుంచి దిగారు. స్థానికులు వారికి అక్కడి సాంప్రదాయ నృత్యాలు మరియాచి, జానపద నృత్య ప్రదర్శనలతో స్వాగతం పలికారు. రోజుంతా ప్రయాణికులు ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. తర్వాత నౌక మెక్సికో కరేబియన్ లోని కోజుమెల్ వెళుతోంది.
ఓడలో అద్భతమైన ఇంటీరియర్ డిజైన్ తో ఆకట్టుకుందని.. ఓడలోని అందించే సేవలు ఇలా ప్రతిదీ అంచనాలకు మించి ఉన్నాయని ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెబుతున్నారు. క్వింటానా రూ దక్షిణ ప్రాంతం అద్భుతమైన పర్యాటక ప్రాంతం.. క్రూయిజ్ షిపులలో ప్రయాణించే వారికి ఇది ఓ మంచి టూరిస్ట్ స్పాట్. అనేక వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది.
‘ఐకాన్ ఆప్ ది సీస్’ గురించి చెప్పాలంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక. 2023 జూన్ 22న విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ ను పూర్తి చేసింది. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థ కు చెందిన ఈ నౌక ఐకాన్ ఆఫ్ ది సీగా ప్రసిద్ధి చెందింది. ఇది టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది. ఫిన్లాండ్ లోని మేయర్ తుర్క్ షిప్పియార్డ్ దీనిని నిర్మించింది. ఈ నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2లక్షల 50వేల 800 కిలోలు . 20 అంతస్థులు.7,600 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించొచ్చు.
ALSO READ :- కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుని కూలుతున్న కాళేశ్వరం కట్టిండు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
సముద్రంలో మొట్టమొదటి స్విమ్ అప్ బార్ నుంచి రికార్డ్ స్థాయిలో 6 వాటర్ పార్క్, కొత్త పరికరాలు, బార్లు, లాంజ్ లు, రెస్టారెంట్ లు ఉన్న ఏకైక క్రూయిజ్ ఐకాన్ ఆఫ్ ది సీస్. వీటిలో 1400 లాబీ బార్, పెరల్ కేఫ్, డ్యూలింగ్ పియానోస్, మొట్టమొదటి డబుల్ పియానిస్ట్ బార్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే రాయొచ్చు ఈ ఐకాన్ ఆప్ సీస్ గురించి.