వాహన ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలంటూ లారీ ఓనర్స్ డిమాండ్

వాహన ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలంటూ లారీ ఓనర్స్ డిమాండ్

పెంచిన వాహన ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలంటూ తెలంగాణ లారీ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. రోజువారీగా 50 రూపాయల ఫెనాల్టీ విధించడం కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్నామనీ... సరుకు రవాణా కష్టంగా మారిందని అంటున్నారు. ఇలాంటి టైమ్ లో అదనపు ట్యాక్సులు వేస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.  ఈనెల 19 నుంచి బంద్ కు పిలుపు ఇచ్చారు. వాహనాలపై గ్రీన్ టాక్స్ , లైఫ్ టాక్స్ తో పాటు ఫిట్నెస్ ఛార్జీల పెంపడాన్ని నిరసిస్తూ ఈ నెల 19న లారీలు, ఆటోలు, క్యాబ్స్ బంద్ పాటిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ఐదు లక్షలకు పైగా గూడ్స్, ట్రాన్స్ పోర్ట్, సప్లయ్ వెహికల్స్ ఉన్నాయి. రవాణా రంగంపై ఆధారపడి దాదాపు 80 లక్షల మంది బతుకుతున్నారు. 2019లో కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం... విదేశాల్లోని చట్టాలకు అనుగుణంగా తీసుకున్నారనీ... దాన్ని దేశమంతా వ్యతిరేకిస్తోందని చెబుతున్నారు లారీ ఓనర్లు. 

కరోనా కారణంగా లారీ, ఆటో, క్యాబ్ ల కార్మికులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. గత రెండేళ్ళుగా ఫిట్ నెస్  సర్టిఫికెట్స్ పెండింగ్ లో ఉన్నాయనీ... ఈ టైమ్ లో జరిమానాలు వేయడం సరైనది కాదంటున్నారు లారీ సంఘాల నేతలు. పెనాల్టిలని  వెంటనే రద్దు చేసి... రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు ఆటో, క్యాబ్, లారీ సంఘాల నేతలు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు యాడ్ బ్లూ లిక్విడ్ ధర కూడా పెరిగిందనీ.... గతంలో 800 ఉన్న దీని ధర ఇప్పుడు 1800 రూపాయలుగా ఉన్నట్టు లారీ ఓనర్స్ చెబుతున్నారు. ప్రభుత్వం తమ ఇబ్బందులు గుర్తించి ట్యాక్సులు, పెనాల్టీలు ఎత్తివేయాలని రవాణా రంగ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎఫ్3లో మినిమమ్ ఇట్లా ఉండాలా అంటున్న పూజా

ఖమ్మంలో మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మ దహనం

మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనం ప్రారంభం