లేజర్​ వెపన్​.. శత్రువుల డ్రోన్ లను పేల్చేస్తది

 లండన్: కిలోమీటర్  దూరం నుంచి కేవలం కాయిన్ అంత ఉన్న టార్గెట్ ను సైతం ఛేదించగలిగే ‘డ్రాగన్ ఫైర్’ లేజర్ వెపన్ ను బ్రిటన్  అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జనవరిలో స్కాట్లండ్ లోని హెర్ బ్రైడ్స్ లో దీనిని పరీక్షించింది. టెస్టుకు సంబంధించిన వీడియోను యూకే  తాజాగా విడుదల చేసింది. ఇది బ్రిటన్ తయారుచేసుకున్న తొలి లేజర్ వెపన్. శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను ఛేదించేలా దీనిని డెవలప్  చేశారు. ఈ వెపన్ తో ఖర్చు భారీగా తగ్గడంతోపాటు పరిసరాలకు జరిగే నష్టం కూడా తగ్గుతుంది. అయితే, దీని మ్యాగ్జిమమ్  రేంజ్ ఎంతన్నది వెల్లడికాలేదు. కానీ, తన రేంజ్ లో కంటికి కనిపించే ఏ టార్గెట్ ను అయినా ఛేదిస్తుందని చెప్తున్నారు.