మార్చి 1 నుంచి లాసెట్ అప్లికేషన్లు... ఫిబ్రవరి 25 నోటిఫికేషన్ రిలీజ్ 

మార్చి 1 నుంచి లాసెట్ అప్లికేషన్లు... ఫిబ్రవరి 25 నోటిఫికేషన్ రిలీజ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ మంగళవారం రిలీజ్ కానున్నది.  మార్చి1 నుంచి దరఖాస్తులు ప్రారంభంకానున్నాయని లాసెట్, పీజీఎల్ సెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన రిలీజ్ చేశారు. వచ్చేనెల1 నుంచి  ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. జనరల్ అభ్యర్థులకు రూ.900,  ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600 ఫీజు ఉంది.  

పీజీఎల్ సెట్ జనరల్ అభ్యర్థులకు రూ.1100 ఫీజు ఉండగా,  ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.900గా నిర్ణయించారు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 25 వరకు, రూ.వెయ్యి   జరిమానాతో మే5 వేల వరకు, రూ.2 వేలు ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.4 వేల లేట్ ఫీజుతో  మే 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షలు జూన్ 6వ తేదీన జరగనుంది.

మార్చి 3 నుంచి ఈసెట్ అప్లికేషన్లు.. 

ఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి3 నుంచి ప్రారంభం కానున్నది. మంగళవారం ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ కానున్నదని ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పరీక్షను మే 12వ తేదీన నిర్వహించనున్నారు.