బోనమెత్తిన లష్కర్.. ఫొటోలు

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి లష్కర్​ బోనమెత్తింది. భక్తుల  కోలాహలం, శివసత్తుల ఆటలు, పోతరాజుల విన్యాసాలు నడుమ అంగరంగ వైభవంగా బోనాల జాతర కొనసాగింది. ఆదివారం తెల్లవారు జామున అమ్మవారికి తొలిబోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.  ఉదయం10 గంటల తర్వాత భక్తుల రద్దీ  పెరుగుతూ.. రాత్రిదాకా పోటెత్తారు.


వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో తరలిరాగా.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బల్దియా అధికారులు అన్ని వసతులు కల్పించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు కొనసాగించారు. వీఐపీలతో పాటు సాధారణ భక్తుల దర్శనాలు సాఫీగా కొనసాగాయి. సోమవారం ఉదయం రంగం.. సాయంత్రం ఫలహారపు బండ్లు, తొట్టెలు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.     - సికింద్రాబాద్,వెలుగు