రువాండాలో లష్కరే టెర్రరిస్టు అరెస్ట్​.. భారత్​కు అప్పగింత

రువాండాలో లష్కరే టెర్రరిస్టు అరెస్ట్​.. భారత్​కు అప్పగింత

న్యూఢిల్లీ: లష్కరే తాయిబాకు చెందిన టెర్రరిస్టు సల్మాన్  రెహమాన్  ఖాన్ ను రువాండాలో పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అతడిని భారత్ కు అప్పగించారు. బెంగళూరు ప్రిసన్స్  టెర్రర్  కుట్ర కేసుతో పాటు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు ఆయుధాలను స్మగ్లింగ్  చేశాడని సల్మాన్ పై కేసులు ఉన్నాయి.

బెంగళూరు జైల్లో ఉండగా అతను రువాండాకు పారిపోయాడు. దీంతో అతడిపై రువాండా ప్రభుత్వానికి భారత్  ఫిర్యాదు చేసింది. రువాండా ఇన్వెస్టిగేషన్  బ్యూరో (ఆర్ఐబీ)సహాయంతో అతడిని రువాండా రాజధాని కిగలిలో బుధవారం అరెస్టు చేశారు.