లష్కర్​ ఉజ్జయిని మహంకాళి హుండీ ఆదాయం రూ.75.30 లక్షలు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ హుండీల లెక్కింపు పూర్తయింది. ఆలయ ఆవరణలో సోమవారం ఉదయం మొదలైన లెక్కింపు అర్ధరాత్రి ముగిసింది. ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు భక్తులు నోట్ల రూపంలో రూ.73లక్షల9వేల371 సమర్పించారని ఆలయ ఈఓ గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు.

అలాగే రూ.2లక్షల20వేల784 కాయిన్లు సమకూరాయని చెప్పారు. లెక్కింపులో దేవాదాయ శాఖ అధికారి, సికింద్రాబాద్ అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి, ఇన్​స్పెక్టర్ శ్రీదేవి, ఆలయ ఫౌండర్ కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.