అబుదాబీ: శ్రీలంక మాజీ కెప్టెన్, స్పీడ్‌స్టర్ లసిత్ మలింగ ఐపీఎల్–13కు దూరమయ్యాడు. ఈ మేరకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ బుధవారం ఓ ప్రకటన చేసింది. మలింగ అందుబాటులో లేకపోవడంతో ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసినట్టు వెల్లడించింది. ఆసీస్ పేసర్ ఈ వీకెండ్‌లో జట్టుతో కలుస్తాడని తెలిపింది. కొన్నేళ్లుగా ముంబై బౌలింగ్ లైనప్‌లో మలింగ కీలక పాత్ర పోషించాడు. ‘ వ్యక్తిగత కారణాలతో ఫ్యామిలీతో కలిసి ఉండాల్సి రావడం వల్ల లీగ్‌కు అందుబాటులో ఉండడం లేదని మలింగ మాకు తెలియజేశాడు. అతని అవసరాన్ని, నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. లసిత్ ప్లేస్‌లో జేమ్స్‌ను తీసుకున్నాం. యూఏఈ కండిషన్స్‌కు అతను సూటవుతాడని భావిస్తున్నాం. ముంబై జట్టుకు ఓ పిల్లర్ అయిన లసిత్ ఓ లెజెండ్. అతన్ని ఈసారి కచ్చితంగా మిస్ అవుతున్నాం ’అని ముంబై ఇండియన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన ప్యాటిన్సన్.. 15 వన్డేలు, 4 టీ20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
For More News..