వాహనదారులకు అలర్ట్.. మీరు ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేసుకున్నారా లేదా.. ఎందుకంటే ఇవాళ్టికే (ఫిబ్రవరి29)లాస్ట్ డేట్. అప్‌డేట్ చేయకపోతే రేపటినుంచి ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలు డీయాక్టివేట్ అవుతాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ వసూలును సులభతరం చేయడానికి, అంతేకాకుండా ట్రాపిక్ ను కంట్రోల్ చేసేందుకు కేంద్రం వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
అయితే ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ చేయాలనుకుంటే కచ్చితంగా కేవైసీని పూర్తి చేసి ఉండాలి. అప్‌డేట్ చేసుకోవడానికి ఈ నెల (ఫిబ్రవరి) 29 వరకు కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయకపోతే ఆయా ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు డియాక్టివేట్ అవుతాయి. ఇంతకీ ఫాస్ట్ ట్యాక్ కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా అప్ డేట్ చేయాలంటే..
- బ్యాంక్-లింక్ చేయబడి ఉన్న ఫాస్టాగ్ (Fastag) వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి. ఆ తర్వాత OTPని నమోదు చేయండి.
- My Profile సెక్షన్ కు వెళ్లి KYC ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన వివరాలను పూరించిన తర్వాత, submit బటన్‌ను క్లిక్ చేయండి.
- ఈ విధంగా, KYC పూర్తవుతుంది. ఆ తర్వాత KYC పేజీ మీ KYC స్టేటస్ ను చూపుతుంది.
ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ ను ఎలా చెక్ చేయలి?
- మీరు fastag.ihmcl.comని సందర్శించడం ద్వారా ఫాస్టాగ్ స్టేటస్ ను చెక్ చేయవచ్చు.
- వెబ్ పేజీ ఓపెన్ కాగానే మీరు వెబ్‌సైట్ కుడి ఎగువ భాగంలోని ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ చేయడానికి, మీరు OTP కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను టైప్ చేయాలి.
- లాగిన్ అయిన తర్వాత, డ్యాష్‌బోర్డ్‌లోని మై ప్రొఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మై ప్రొఫైల్ సెక్షన్ లో, మీరు మీ FASTag KYC స్టేటస్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో సమర్పించిన ప్రొఫైల్ వివరాలను కూడా చూడవచ్చు.
ఫాస్టాగ్ కేవైసీ కోసం అవసరమయ్యే పత్రాలు
- వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- గుర్తింపు కార్డు
- అడ్రస్ ప్రూఫ్
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- ముఖ్యంగా, ID, చిరునామా కోసం పాస్‌పోర్ట్, ఓటరు ID కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు ఉపయోగించవచ్చు.