కులగణనకు ఇంకా రెండు రోజులే టైం.. ఆ ముగ్గురి నుంచి నో రెస్పాన్స్​

 కులగణనకు ఇంకా రెండు రోజులే టైం.. ఆ ముగ్గురి నుంచి నో రెస్పాన్స్​
  • 3.56 లక్షలకుగాను 2 శాతం ఫ్యామిలీలే నమోదు
  • కులగణనలో మిస్ అయినోళ్లకు ఎల్లుండే ఆఖరు తేదీ    
  •  ఇంకా వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: సమగ్ర కులగణన సర్వేలో వివరాలు ఇవ్వని కుటుంబాల కోసం రాష్ట్ర సర్కారు రీసర్వే సైతం చేపట్టినా.. సరైన స్పందన మాత్రం రావడం లేదు. రాష్ట్రంలో మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల వివరాలను రెండోసారి సర్వేలో సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 8,422 కుటుంబాలే వివరాలు ఎంట్రీ చేయించుకున్నాయి. కులగణన రీసర్వే ఈ శుక్రవారంతో ముగియనుండగా, ఆలోపు ఎంత మంది స్పందిస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. 


గతంలో కుల గణన సర్వేలో పాల్గొనని కుటుంబాలకు మరోసారి అవకాశం కల్పిస్తూ ఈ నెల16వ తేదీ నుంచి మళ్లీ వివరాల నమోదును రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. మరో రెండు రోజుల్లో రీసర్వే గడువు కూడా ముగియనుంది. శుక్రవారం నాటికి ఇంకో రెండు, మూడు వేల కుటుంబాలు మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం10 వేల కుటుంబాలు అయినా వివరాలిస్తాయా? లేదా? అన్న అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రంలో గుర్తించిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకుగాను మొదటి సర్వేలో 1,12,15,134 కుటుంబాల(96.9) వివరాలు నమోదు చేశారు. ఇంకా 3.1 శాతం(3,56,323) కుటుంబాలు మిగిలిపోవడంతో రెండోసారి సర్వే చేస్తున్నారు. ఇందులోనూ మంగళవారం నాటికి 2 శాతం కుటుంబాలే వివరాలు నమోదు చేసుకున్నాయి. 

ఆ ముగ్గురి నుంచి నో రెస్పాన్స్​ 

కుల గణన సర్వేలో మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావుతోపాటు పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ లీడర్లు కొంతమంది వివరాలు నమోదు చేసుకోలేదు. గత నవంబర్​లో  సర్వే సరిగ్గా చేయలేదని, బీసీల జనాభా తగ్గించారని, రీసర్వే చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున కోర్టుల్లో ఇబ్బంది రాకుండా ఉండేందుకు మిగిలిపోయిన కుటుంబాలు వివరాలు నమోదు చేయించుకునేందుకు ప్రభుత్వం రెండోసారి సర్వే చేపట్టింది. మొదటిసారి 2024 నవంబరు 6 నుంచి డిసెంబరు 25 వరకు ఇంటింటి కుల గణన సర్వే నిర్వహించారు. రెండోసారి ఈ నెల16న ప్రారంభించిన సర్వే 28వ తేదీన ముగియనుంది.

మూడు రకాలుగా వివరాలు ఇవ్వొచ్చు.. 

    ప్రభుత్వం ప్రకటించిన టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రీ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 040-21111111కు ప్రజలు ముందుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, కులగణనలో తమ వివరాలను పొందుపర్చాలని కోరవచ్చు. ఈ నెల 16 నుంచి 28 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయవచ్చు. ఎవరైనా ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే.. సంబంధిత అధికారి కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి కుల గణన వివరాలు సేకరిస్తారు.  

  • గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీడీఓ ఆఫీసుల్లో, పట్టణ ప్రాంతాల్లోని వార్డు ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలనా సేవా కేంద్రాలకు ప్రజలు నేరుగా వెళ్లి కూడా తమ వివరాలను అందించవచ్చు. 
  •  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో http//seeepcsurvey.cgg.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సర్వే ఫారాన్ని డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. తమ కుటుంబ వివరాలను భర్తీ చేసిన తర్వాత, ఆ ఫారాన్ని దగ్గరలోని ప్రజా పాలనా సేవా కేంద్రంలో సమర్పించవచ్చు.