Aadhaar with PAN Link: ఆధార్ కార్డు, పాన్ కార్డుకు లింక్ చేశారా..లేకుంటే తిప్పలే..

Aadhaar with PAN Link: ఆధార్ కార్డు, పాన్ కార్డుకు లింక్ చేశారా..లేకుంటే తిప్పలే..

మీ పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేశారా.. లేకుంటే వెంటనే చేయండి.. గడువు తేదీ దగ్గరపడుతోంది. పాన్ తో ఆధార్ లింక్ చేయకుండా పాన్ కార్డు డీయాక్టివేట్ అయి  లావాదేవీల్లో అనేక సమస్యలు  ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

కేంద్ర హోంశాఖ..పాన్ కార్డుతో ఆధార్ లింక్ తప్పనిసరి చేసినవిషయం తెలిసిందే. పాన్ కార్డు, ఆధార్ లింకప్ కు ఇప్పటికే చాలాసార్లు అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 31 పాన్ తో ఆధార్ లింక్ చేసుకునేందుకు చివరి అవకాశం. అలా చేయడంలో విఫలమైతే పాన్ కార్డు డియాక్టీవేట్ చేయబడి లావాదేవీల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

ALSO READ | ఒప్పోFind X8 series స్మార్ట్ ఫోన్లు త్వరలో లాంచ్..కెమెరా ఫీచర్లు ఖతర్నాక్

ఆర్థిక నేరాలు, మోసాలు పెరుగుతున్న క్రమంలో ఇన్ కం ట్యాక్స్ డిపార్టుమెంట్ పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాలని సూచించింది. ఫిన్ టెక్ సంస్థలు కస్టమర్ల అనుమతి లేకుండా వారి ఫ్రొఫైల్ ను పాన్ సమాచారం ద్వారా వినియోగిస్తు్ండటం తీవ్ర ఆందోళనలకు గురి చేస్తుంది కాబట్టి వ్యక్తి గత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు పాన్ ద్వారా వ్యక్తిగత వివరాలను సెక్యూర్ గా ఉంచాలని కేంద్ర హోంశాఖ ఇన్ కం ట్యాక్సు డిపార్టుమెంట్ను ఆదేశించింది. 

పాన్-ఆధార్ లింక్ చేశారా లేదా ఇలా తెలుసుకోండి

  • www.incometax.gov.in లో ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించాలి. 
  • హోమ్‌పేజీలో క్విక్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • లింక్ ఆధార్ స్థితిపై క్లిక్ చేసి కొత్త పేజీలో మీ పాన్, ఆధార్ కార్డ్ నంబర్లను ఎంటర్ చేయాలి. 
  • మీ పాన్, ఆధార్ ఇప్పటికే లింక్ చేయబడి ఉంటే  "మీ పాన్ ఇప్పటికే ఇచ్చిన ఆధార్‌కి లింక్ చేయబడింది" అని మేసేజ్ పాప్ అప్ అవుతుంది. -
  • పూర్తి చేయకుంటే.."PAN ఆధార్‌తో లింక్ చేయబడలేదు అని పాప్ అప్ వస్తుంది. 
  • అప్పుడు వెబ్‌సైట్ ఎడమ వైపున త్వరిత లింక్‌ల విభాగంలో కనిపించే 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయాలి . 
  • తిరిగి మీరు మీ పాన్ , ఆధార్ వివరాలు , ఆధార్ కార్డ్ ప్రకారం మీ పేరుతో సహా వివరాలను ఫైల్ చేయాల్సిన ఉంటుంది.