ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటిన వారందరు అప్డేట్ చేసుకునేందుకు లాస్ట్ డేట్ ఇవాళ్టి( 2024, సెప్టెంబర్ 14) తో ముగిస్తుంది. వ్యక్తిగత గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ డాక్యు మెంట్లను సబ్మిట్ చేసి అప్డేట్ చేసుకోవాలని UIDAI తెలిపింది.
సెప్టెంబర్ 14 తర్వాత మార్పు చేసుకోవాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రాలు, ఆన్ లైన్ ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. అయితే వేలిముద్రలు, ఐరీస్ స్కాన్స్ , ముఖ చిత్రం వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్డేట్ చేసుకోలేరని తెలిపింది.
ఆధార్ కార్డు..ఇది లేకుండా ఏ పనిజరగదు. ఇది మన గుర్తింపుగా పనిచేస్తుంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా.. విద్యాసంస్థల్లో నమోదు చేసుకోవాలన్నా.. ఆరోగ్య సంరక్షణ పొందాలన్నా.. ప్రభుత్వం ఇచ్చే ప్రజా సంక్షేమ పథకాలు పొందాలన్నా ఇది తప్పనిసరి. అయితే ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డేటా ఉన్నందున మిస్ యూజ్ అయ్యే అవకాశం ఉందని UIDAI హెచ్చరిస్తోంది. ట్యాంపరింగ్ చేయడం ద్వారా సైబర్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందని .. ప్రజలు తమ ఆధార్ కార్డు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది.
ఐడెంటిటీ ధృవీకరణ కోసం అన్ని సిస్టమ్‌లు, mAadhaar యాప్ ద్వారా లేదా ఆధార్ QR కోడ్ స్కానర్‌ని ఉపయోగించి ఆధార్ కార్డ్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చని UIDAI పేర్కొంది. ఈ QR కోడ్‌తో ఏదైనా ట్యాంపరింగ్ జరిగితే ఈ సందర్భాలలో ఆధార్ కార్డ్ పనికిరాకుండా పోతుంది.కాబట్టి కార్డ్ హోల్డర్‌లు దానిని సురక్షితంగా ఉంచుకోవాలని సూచిస్తోంది.