జెయింట్ కిల్లర్స్ : మహామహులను ఓడించారు

రాజకీయాల్లో ప్రజలదే అంతిమ తీర్పు. ఎన్నికల బరిలో నిల్చున్న కేండిడేట్లను చూసినప్పుడు మీడియాకి, పోల్‌ పండిట్లకు కొన్ని స్పష్టమైన అంచనాలుంటాయి. హేమాహేమీలపై ఒక్కోసారి అతి సామాన్యులు నిలబడుతుంటారు. అలాంటి సందర్భాల్లో సంస్థానాధీశులైనా, సీనియర్‌‌ పాలిటీషియన్లయినా, పాపులర్‌‌ సినీ స్టార్లయినా ఓటర్లు తలచుకుంటే ఓటమి చవిచూడాల్సిందే. చరిత్ర చెబుతున్నదిదే!

రాజకీయాలంటేనే చాలా చిత్రమైనవి. ప్రజలే తమ ప్రభువులను నిర్ణయించుకునే శక్తివంతులు. ఏమాత్రం తేడా వచ్చినా ఓటు ప్రయోగించి వెనక్కి నెట్టేస్తారు. పండిట్‌ నెహ్రూకుమార్తెగా రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్న ఇందిరాగాంధీ… ప్రధాని అయిన కొద్దికాలానికే సీనియర్లకు చుక్కలు చూపించారు. 1970 తర్వాత తిరుగులేని శక్తిగా మారిపోయారు. 1975 నాటికి నియంతగా తయారయ్యారు. ఎమర్జెన్సీ విధించి అపోజిషన్‌ లీడర్లు అందరినీ జైలు పాలు చేశారు. ప్రజాస్వామ్య హక్కుల్ని నేల రాసేశారు. దాదాపు 21 నెలల పాటు సాగిన ఎమర్జెన్సీ వల్ల ఉత్తరాదిలో బాగా వ్యతిరేకత పెరిగింది.1977 నాటికి ప్రతిపక్షాలన్నీ ఏకమై జనతా పార్టీగా అవతరించాయి. ఆ ఏడాదిలో ఎమర్జెన్సీని ఎత్తేసి, జనరల్‌ ఎలక్షన్స్‌‌  జరిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ ఎన్నికల్లో రాయ్‌ బరేలీ నియోజకవర్గం నుం చి జనతా పార్టీ అభ్యర్థిగా రాజ్‌ నారాయణ్‌ నిలబడగా, కాం గ్రెస్‌ కేండిడేట్‌ గా ఇందిరా గాంధీ పోటీకి దిగారు. రాయ్‌ బరేలీ జనం రాజ్‌ నారాయణ్‌వైపు మొగ్గు చూపించారు. 1977లో ఇందిరా గాం ధీ 55,702 ఓట్లతో రాజ్‌ నారాయణ్‌ చేతిలో ఓటమి చవి చూశారు.అలాగని, రాజ్‌ నారాయణ్‌ మరీ అనామకుడేమీ కాదు. రామ్‌మనోహర్‌ లోహియా, జయప్రకాశ్‌ నారాయణ్‌ల అనుచరుడు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొ ని జైలుకెళ్లారు. సోషలిస్టు పార్టీలో పనిచేశారు. విద్యార్థి, సామాజిక ఉద్యమాల్లో  58సార్లుఅరెస్టయి , మొత్తంగా 15 ఏళ్లు జైలు జీవితం గడిపారు. ఇవన్నీఎలా ఉన్నా, ఇందిరాగాంధీని ఓడించిన ఘనుడిగా రాజ్‌ నారాయణ్‌ చరిత్రలో నిలిచిపోయారు.

సింధియా చేతిలో వాజ్‌ పేయి ఓటమి

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో … మధ్యం తర ఎన్నికలు రావడంతో మరలా ఇందిరా గాంధీయే దేశ ప్రధాని కాగలిగారు. 1984లో సొంత బాడీగార్డుల తుపాకీ గుళ్లకు ఇందిర బలయ్యారు. ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ ప్రధాని అయ్యారు. ఆయన నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో హేమాహేమీలెందరో ఓడిపోయారు.వారిలో ముఖ్యులు అటల్‌ బిహారీ వాజ్‌ పేయి. అంతకుముందు ఢిల్లీ నుం చి రెండు సార్లు (1977, 80ల్లో ) నెగ్గినవాజ్‌ పేయి, 1984లో సొంత నగరమైన గ్వాలియర్‌ (మధ్యప్రదే-శ్‌ ) నుం చి పోటీకి దిగారు. ఆయనపై కాం గ్రెస్‌ అభ్యర్థిగా గ్వాలియర్‌ సంస్థానాధీశుడు మాధవరావు సింధియా పోటీ చేసి లక్షా 75 వేలపై చిలుకు ఓట్లతో గెలుపొందారు. సింధియాని అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడైన ప్రధాని రాజీవ్‌ గాంధీ నామినేషన్ల చిట్టచివరి క్షణంలో ఎంపిక చేసి పోటీలో నిలబెట్టారు. ఆ తర్వాత మాధవరావు సింధియా కేంద్ర కేబినెట్‌ లో కీలక బాధ్యతలు అందుకున్నారు.

సోమనాథ్‌ ని ఓడించిన మమత

ఇలాంటిదే మరో ఘటన… పశ్చిమ బెం గాల్‌ లో చోటుచేసుకుంది.1971 నుం చి ఓటమి ఎరుగని మార్క్సిస్టు యోధుడు సోమనాథ్‌ చటర్జీని 1984లో మమతా బెనర్జీ ఓడించేశారు. జాదవ్‌ పూర్‌ నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడిం ది. అప్పటికి మమత యూత్‌ కాం గ్రెస్‌ నాయకురాలు. సోమనాథ్‌ పై గెలిచిననాటి నుంచి ఇప్పటి వరకు మమతకు అన్నీ వరుస విజయాలే దక్కడం విశేషం. లోక్‌ సభ స్పీకర్‌ గా పనిచేసిన సోమనాథ్‌ చటర్జీ మొత్తం రాజకీయ జీవితంలో 10 సార్లు లోక్‌ సభకు ఎన్ని క కాగా, ఓడిపోయింది మాత్రం ఒకే ఒక్కసారి… మమతా బెనర్జీ చేతిలో!

నాన్‌ –లోకల్‌ జయప్రద సంచలనం

ఉత్తర ప్రదేశ్‌ లో రామ్‌ పూర్‌ సంస్థానానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడినుం చి నవాబ్‌ జుల్ఫికర్‌ అలీ ఖాన్‌ అయిదు సార్లు… కాం గ్రెస్‌ టిక్కెట్టు పై 1967, 71, 80, 84, 89 ఎన్నికల్లో గెలిచి లోక్‌ సభలో సభ్యు డయ్యారు. ఆయన మరణం తర్వాత బేగం నూర్​ బానో రెండుసార్లు కాం గ్రెస్‌ టిక్కెట్టుపైనే ఎంపీ అయ్యారు. 1996, 99 సంవత్సరాల్లో జరిగిన జనరల్‌ ఎలక్షన్స్‌‌లో రాం పూర్‌ నుంచి బేగం నూర్​ బానో గెలిచారు. అలాం టి తిరుగులేని హిస్టరీ గల రాం పూర్‌ సంస్థానాధీశురాలు నూర్​ బానోని సినీ నటి జయప్రద రెండుసార్లు దెబ్బతీశారు. జయప్రద పూర్తిగా నాన్‌ –లోకల్‌ . ఆంధ్రపదేశ్‌ లో ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జయప్రద మొదట్లో సినీతారగా ఇండియా మొత్తం పాపులారిటీ సాధించారు. తనకు డిమాం డ్‌ఉన్న రోజుల్లోనే రాజకీయాల్లో ప్రవేశించి తెలుగు దేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో అమర్‌ సింగ్‌ సలహాతో ఆమె ఉత్తరప్రదేశ్‌ కి షిప్ట్‌‌ అయ్యారు. ములాయం సింగ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌ వాది పార్టీలో చేరి, రాం పూర్‌ నుంచి లోక్‌ సభకు పోటీ చేసి సక్సెసయ్యారు. 2004లో మొదటిసారి ఆమె రాంపూర్‌ లో పోటీ  చేసినప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అలాం టిది బేగం నూర్​ బానోని ఓడించేసరికి కాంగ్రెస్‌ వర్గాలే కాకుండా యూపీ పొలి టికల్‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ సైతం కంగు తిన్నా రు. అయిదేళ్ల తర్వాత 2009లోనూ ఇదే ఫీట్‌ ని జయప్రద రిపీట్‌ చేయగలిగారు.

చిత్తరంజన్‌ రికార్డు గెలుపు

1985లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన మధ్యం తర ఎన్నికల్లోవిజయం సాధించాక, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమం-త్రి నందమూరి తారక రామారావు దృష్టి నేషనల్‌ పాలిటిక్స్‌‌పైపడిం ది. కాం గ్రెస్‌ పార్టీపై వ్యతిరేకతతోనే పుట్టిన పార్టీ కావడంతో తెలుగు దేశంపై జాతీయ నాయకులందరికీ నమ్మకం ఏర్పడింది.రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాం గ్రెస్‌ పార్టీ అనేక కొనుగోలుఒప్పం దాల్లో అవినీతికి పాల్పడిం దన్న ఆరోపణలు మొదల-య్యాయి. ముఖ్యం గా బోఫోర్స్‌‌ లావాదేవీల్లో రాజీవ్‌ ప్రభుత్వం బాగా అప్రతిష్ట పాలయ్యిం ది. ఆ సమయంలో ఎన్‌ .టి.రామారావు ఢిల్లీ రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరిం చారు. పొద్దున్న ఢిల్లీలో , సాయంత్ర మయ్యేసరికి హైదరాబాద్‌ లో అన్నట్లుగా ఉండేది ఆయన దినచర్య. నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ హోదాలో ఎన్టీఆర్‌ వార్తలకు నేషనల్‌ మీడియా విపరీత ప్రచారం ఇచ్చేది. ఆయన వార్త లేకుండా నేషనల్‌ డైలీల ఫస్ట్‌‌ పేజీ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. అలాం టి రామారావు 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో తెలంగాణలోని కల్వకుర్తి నుంచి పోటీకి దిగి, కాం గ్రెస్‌ అభ్యర్థి చిత్తరంజన్‌ దాస్‌ చేతిలో ఓడిపోయారు! ఎన్టీఆర్‌ పై చిత్తరంజన్‌ కి వచ్చిన మెజారిటీ 3,568 ఓట్లు. సినీరంగం నుం చి రాజకీయాల్లో ప్రవేశించాక జనం చేతిలో ఎన్టీఆర్‌ ఓడిపోయిన సందర్భం అదొక్కటే!

అమితాబ్‌ పొలిటికల్‌ ఎంట్రీ

రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్‌ పొలి టీషియన్‌ … రాజకీయానుభవం లేని ఒక సినిమా యాక్టర్‌  చేతిలో దెబ్బతిన్నఘటన 1984లో చోటు చేసుకుంది. హెచ్‌ .ఎన్‌ .బహుగుణ రెండుసార్లు  కాం గ్రెస్‌ తరఫున ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌ కి ముఖ్యమంత్రిగా,ఒకసారి కేం ద్ర కేబినెట్‌ లో కూడా పనిచేశారు. ఆ తర్వాత కాం గ్రెస్‌ తో విభేదించి చౌధురి చరణ్‌సింగ్‌ కి చెందిన బీఎల్‌ డీ అభ్యర్థిగా పోటీకి దిగారు. రాజీవ్‌ గాంధీ తన మిత్రుడైన సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ని బరిలోకి వదిలారు. అప్పటివరకు ఓటమి ఎరుగని బహుగుణ… జస్ట్‌‌ ఎంట్రీ ఇచ్చిన అమితాబ్‌ చేతిలో ఓడిపోయారు.

పాటిల్‌ని ఓడించిన ఫెర్నాండెజ్

రెండు దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా నిలిచిన లీడర్ జార్జ్ ఫెర్నాండెజ్ సొంతూరు కర్ణాటకలోని మంగుళూరు. 1949లో పొట్టచేత పట్టుకుని ముంబై వచ్చారు. ఈ సమయంలోనే సోషలిస్టు నేత రాం మనోహర్  లోహియా సిద్ధాంతాలతో ప్రభావితుడయ్యారు.  సోషలిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘాల్లో పనిచేయడం మొదలెట్టారు. ‘హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్)’లో  కీలక నేతగా ఎదిగారు. ముం బైలో కార్మికోద్యమాలకు చిరునామాగా నిలిచారు.  ట్రేడ్ యూనియన్ లీడర్‌గా పాపులర్ కావడంతో‘సంయుక్త సోషలిస్టుపార్టీ (ఎస్‌ఎస్‌పీ)’ ఆయనను దక్షిణ ముం బై నుం చి లోక్‌సభ బరిలోకి దించిం ది. ఈ నియోజకవర్గంలో అప్పటికే 20 ఏళ్లుగా ఎస్‌కే పాటిల్‌ పాతుకుపోయి ఉన్నా రు. 1967 ఎన్ని కల్లో జరిగిన ఎన్నికల్లో పాటిల్‌ని ఫెర్నాండె జ్‌ ఓడించారు. దీం తో ‘జెయింట్ కిల్లర్ ’గా ఫెర్నాండెజ్ దేశమంతా ఫేమస్ అయ్యారు.

గజపతిపై కోలగట్ల గెలుపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు పూసపాటి అశోక్ గజపతి రాజు. విజయనగరం సంస్థానాధీశుల వారసుడిగా ఉత్తరాంధ్రలో ఆయన బాగా పాపులర్. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేం డిడేట్‌గా బరిలో నిలిచిన అశోక్ గజపతి రాజును అప్పట్లో కాం గ్రెస్ తరఫున పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి ఓడించి ‘జెయింట్ కిల్లర్ ’గా పేరు తెచ్చుకున్నా రు.  కేవలం 1,126 ఓట్ల తేడాతోనే అశోక్‌ ఓడిపోయినప్పటికీ, సామాజికపరంగా వైశ్య కులానికి చెందిన కోలగట్ల విజయం సంచలనం రేపింది.

రాజకీయాల్లో ప్రజలే అంతిమ తీర్పు నిచ్చేవారు. సంస్థానాధీశులైనా,సీనియర్‌ పాలిటీషియన్లయి నా, పాపులర్‌ సినీ స్టార్లయి నా ఓటర్లుతలచుకుం టే ఓటమి చవిచూడాల్సిం దే. చరిత్ర చెబుతున్నదిదే! సామాన్యులు సైతం జెయింట్‌ కిల్లర్లు గా ఇండియన్‌ ఎలక్షన్‌ రికార్డుల్లోనమోదు అవుతుంటారు.