AUS vs IND: ఇండియాకు భారీ టార్గెట్

AUS vs IND:  ఇండియాకు భారీ టార్గెట్
  • రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా 228/9
  • రాణించిన లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • బుమ్రాకు 4, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 3 వికెట్లు
  • తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 369 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతూ ఆఖరి రోజుకు చేరుకుంది. ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్లు జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా (4/56), మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3/66) ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసినా.. టెయిలెండర్లు పోరాట స్ఫూర్తిని చూపెట్టారు. దీంతో ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 82 ఓవర్లలో 228/9 స్కోరు చేసింది. నేథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (41 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), స్కాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 358/9 ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 119.3 ఓవర్లలో 369 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఆట మొదలైన తొలి అర్ధగంటలోనే 21 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడి నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (114) ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో ఇండియా 105 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోటుతో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించింది. కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలో మూడేసి వికెట్లు తీశారు.  ప్రస్తుతం కంగారూలు 333 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో ఉన్నారు. దాంతో చివరి రోజు, సోమవారం  ఇండియా అద్భుతం చేస్తేనే గెలవగలదు.  డ్రాతో గట్టెక్కాలన్నా శ్రమించాల్సిందే.  

పేసర్ల జోరు.. టెయిలెండర్ల హోరు

తొలి సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆరంభంలో బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకొట్టారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (8)ను బుమ్రా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి శుభారంభాన్నిచ్చాడు. దీన్ని సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బాగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖవాజ (21)ను వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 43/2తో కష్టాల్లో పడింది. కానీ ఈ దశలో లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (70) కీలక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటంతో కాస్త కోలుకున్నట్లు కనిపించింది. జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా.. రెండో స్పెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరోసారి కంగారూలను వణికించారు. 33వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకు స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (13) ఔటైతే.. 34వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రా నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాలో ట్రావిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్ (1), మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపాడు. ఆ తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అలెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారీ (2)ని ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 10 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ నిలబెట్టాడు. ఇండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించాడు. అయితే 56వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రా.. లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 57 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 59వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (5) అనూహ్యంగా రనౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 156/8తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాదాపు 35 ఓవర్లు ఇండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ ముగ్గురు కలిసి 80 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేయడంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిశగా వెళ్లింది. 

సంక్షిప్త స్కోర్లు


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 474 ఆలౌట్‌‌‌‌‌‌‌‌, ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 119.3 ఓవర్లలో 369 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (నితీశ్‌‌‌‌‌‌‌‌ 114, సుందర్‌‌‌‌‌‌‌‌ 50, కమిన్స్‌‌‌‌‌‌‌‌ 3/89, బోలాండ్‌‌‌‌‌‌‌‌ 3/57, లైయన్‌‌‌‌‌‌‌‌ 3/96), ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 82 ఓవర్లలో 228/9 (లబుషేన్‌‌‌‌‌‌‌‌ 70, కమిన్స్‌‌‌‌‌‌‌‌ 41, లైయన్‌‌‌‌‌‌‌‌ 41 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బుమ్రా 4/56, సిరాజ్‌‌‌‌‌‌‌‌ 3/66).