ఆర్మీ జవాన్ మహేశ్ అంత్యక్రియలు

  •     అంతిమయాత్రలో పాల్గొన్నఎమ్మెల్యే జైవీర్ రెడ్డి  

హాలియా, వెలుగు : ఈనెల 25న అస్సాంలో అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మీ జవాన్ ఈరేటి మహేశ్ అంత్యక్రియలు అతడి స్వగ్రామం నల్గొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెం గ్రామంలో శనివారం అశ్రునయనాలతో ముగిశాయి. ఆర్మీ జవాన్ మహేశ్ మృతదేహాన్ని అస్సాం ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సికింద్రాబాద్ కు తీసుకొచ్చింది. అనంతరం హాలియా పట్టణంలో మహేశ్ మృతదేహాన్ని భారీ ర్యాలీతో ఊరేగింపు నిర్వహించారు. అక్కడి నుంచి స్వగ్రామం మదారిగూడెం వరకు అంతిమయాత్ర కొనసాగింది.

మహేశ్​మృతదేహాన్ని అతడి నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మహేశ్ మృతదేహాన్ని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. జవాన్​ను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. వీర జవాన్ మహేశ్ అమర్ హై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అనంతరం గ్రామంలోని వైకుంఠధామంలో ఆర్మీ జవాస్లు గాడ్ ఆఫ్ ఆనర్ (గౌరవ లాంఛనాలతో) కుటుంబ సభ్యులు, బంధువులు, జనం మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, స్థానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.