కుమ్మరిగూడలో లాస్య నందిత ప్రచారం

కుమ్మరిగూడలో లాస్య నందిత ప్రచారం

కంటోన్మెంట్, వెలుగు: తనను గెలిపిస్తే.. కంటోన్మెంట్​ సెగ్మెంట్​ను రాష్ట్రంలోనే నంబర్​వన్​గా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత తెలిపారు. ఇతర పార్టీల విష ప్రచారాలను నమ్మొద్దన్నారు.  గురువారం కంటోన్మెంట్ పరిధిలోని 150వ డివిజన్​లో లాస్య నందిత ప్రచారం చేశారు. కుమ్మరిగూడ వెల్ఫేర్, రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై ఓట్లను అభ్యర్థించారు. తనను గెలిపిస్తే.. పెండింగ్ పనులను పూర్తిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కుమ్మరి గూడ వాసుల నుంచి లాస్య నందితకు మద్దతు దక్కింది. ఆమెను గెలిపించుకుంటామని వారు తెలిపారు. కంటోన్మెంట్​లోని మాల సంఘం ప్రతినిధులు లాస్య నందితను కలిసి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీతమ్మ, మాల సంఘం ప్రతినిధులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Also read :- కాంగ్రెస్​ రాగానే రూ.2 లక్షల రుణమాఫీ : బాన్సువాడ అభ్యర్థి ఏనుగు రవీందర్​రెడ్డి