రాష్ట్రంలోని చాలా చోట్ల ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మొరాయించాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తడంతో ఇబ్బందులు తప్పలేదు. అన్నిచోట్ల ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవగా, మెషీన్లు మొరాయించిన చోట లేట్ అయింది. ఒక్కోచోట అర గంట నుంచి గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఉదయం10 గంటల వరకు పోలింగ్ స్టార్ట్ కాలేదు. ఉదయాన్నే ఓటు వేసేందుకు వచ్చినవారు దాదాపు మూడు గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి (బూత్నం.185), మొట్లపల్లి (బూత్నం.186) లోని ఈవీఎంలు పనిచేయకపోవడంతో గంటన్నరకు పైగా పోలింగ్ ఆగింది.
రేగొండ మండలం తిరుమలగిరి (బూత్నం.219) లో గంట పాటు పోలింగ్ నిలిచింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లిలో వీవీ ప్యాట్ మెషీన్ పనిచేయకపోవడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిపివేశారు. మరొక మెషీన్ తెప్పించి తిరిగి ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి, జడ్చర్ల నియోజకవర్గం యన్మన్గండ్లలో, దేవరకద్ర నియోజకవర్గం జీనుగరాల, గోపన్ పల్లిలోని పోలింగ్‌బూత్‌లలో ఈవీఎంలు సతాయించాయి. గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం డబ్బా (బూత్ నంబర్ 32), కోరుట్లలోని బూత్ నంబర్ 148, 143లో, మెట్ పల్లిలోని బూత్ నంబర్ 208, జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్, నర్సింగపూర్, ధర్మపురిలోని బూత్ నంబర్ 39లో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు కొత్త ఈవీఎంలు తెచ్చి ఓటింగ్షురూ చేశారు. ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు (బూత్ నంబర్ 211) లో కొద్దిసేపు ఈవీఎంలు ఆగిపోయాయి. సిరిసిల్ల సెగ్మెంట్ తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో ఈవీఎం సతాయించడంతో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. మెదక్ మండలం పాతూరు సెంటర్లో వీవీ ప్యాట్ పనిచేయలేదు.
దీంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో పాపన్నపేట మండలం మిన్పూర్లో అరగంట, ఎల్లాపూర్‌లో 20 నిమిషాలు ఆలస్యంగా ఓటింగ్ సార్ట్ చేశారు. ఆందోల్ నియోజకవర్గం రేగోడ్లోని 13, 14 పోలింగ్ కేంద్రాల్లో, పెద్దతండాలోఈవీఎంలు సతాయించాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌లోని బూత్ నంబర్ 107లో ఈవీఎం పనిచేయక అరగంట సేపు పోలింగ్ ఆగింది.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో 1300 మందికి ఒకే ఈవీఎం
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి, సైదాపూర్, మాన్సన్ పల్లిలో పోలింగ్ బూత్‌లలో 1000 నుంచి 1,300 మంది ఓటర్లకు ఒకటే ఈవీఎం కేటాయించడంతో ఈవీఎంలు సతాయించాయి. దాదాపు మూడు గంటల పాటు ఓటర్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఆయా కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు ఓటు వేసేందుకు అనుమతించారు. ఖమ్మంలోని రమణగుట్ట (బూత్‌నంబర్ 113)లో ఈవీఎం పనిచేయకపోవడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. సత్తుపల్లి నియోజకవర్గంలోని రామగోవిందాపురం కేంద్రంలో అర గంటకుపైగా ఈవీఎం ఆన్ కాలేదు.
కొత్తది తెప్పించి ఓటింగ్ప్రారంభించారు. అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బాల్యతండాలో గంటన్నర, అయ్యన్నపాలెంలో రెండు గంటలపాటు ఈవీఎంలు పని చేయలేదు. చండ్రుగొండ, రావికంపాడులో సతాయించాయి. దీంతో క్యూలైన్లలో నిలబడలేక ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ లోనూ ఈవీఎంలు పనిచేయలేదు. అధికారులు కొత్తవి రీప్లేస్ చేసి పోలింగ్ కొనసాగించారు. చొప్పదండిలో ఈవీఎం పనిచేయక ఓటింగ్ లేట్అయింది. దీంతో అధికారులపై వ్యవసాయ కూలీలు, రైతులు మండిపడ్డారు.
హుజూరాబాద్ ప్రతాపవాడ (బూత్నం.30) లోనూ ఇదే పరిస్థితి. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఓటేసిన బూత్‌లో రెండు ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు కొత్తవి ఏర్పాటు చేసి పోలింగ్ కంటిన్యూ చేశారు. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో 15 నిమిషాలు ఈవీఎం ఆగింది. వేములవాడ (బూత్నం.182), వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో, తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ లో, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా(బూత్నం.32) లో, జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్, నర్సింగపూర్‌లో, ధర్మపురి(బూత్నం.39) లో, జగిత్యాల జిల్లా రాయికల్‌మండలం వస్తాపూర్, చింతలూర్, రాయికల్ (బూత్నం.26) లో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి ఓటింగ్‌ను ప్రారంభించారు. నిర్మల్‌జిల్లా ఖానాపూర్ (బూత్నం.235)లో ఈవీఎం ఆన్ కాలేదు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. పోలింగ్లేట్అయిన చోట అధికారులు ఓటర్లకు అదనపు సమయం ఇచ్చారు.