
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,019కి చేరగా.. ఇందులో యాక్టివ్ కేసులు 10,860 ఉన్నాయని వెల్లడించింది.
ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 8,920 మంది కోలుకోగా..తాజాగా ఏడుగురు మరణించారని, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 239కి చేరిందని తెలిపింది. ఇవాళ నమోదైన కేసుల్లో ఏపీకి చెందినవి 1,263 కాగా..మరో 59 కేసులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారివని తెలిపింది ఏపీ ఆరోగ్యశాఖ.