ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కు ఆడియన్స్ ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటారు. మైండ్ కు పని పనిపెట్టే థ్రిల్లర్ మూవీస్ తో తెలుగు, తమిళ, మలయాళ మేకర్స్ కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారు. ఇపుడు అలాంటి జోనర్లో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయిన క్రైమ్ డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్ పీఐ మీనా( PI Meena Web Series).
ఈ వెబ్ సీరిస్లో పరంబ్రత ఛటోపాధ్యాయ, జిష్షూసేన్ గుప్తా, తాన్యా మానిక్తలా ప్రధాన పాత్రలు పోషించగా..అలాగే వినయ్ పాఠక్, జరీనా వాహబ్ కీ రోల్స్ ప్లే చేశారు. క్రైమ్ గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన పీఐ మీనా వెబ్ సీరిస్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 3న స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు.
ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే..మిస్టరీ మర్డర్స్ చేధించడానికి రంగంలోకి దిగిన ప్రైవేట్ డిటెక్టివ్ మీనా పాత్ర క్యారెక్టర్ చుట్టూ ఈ సిరీస్ ఇంటెన్సివ్ గా సాగుతుందని సమాచారం. ఎన్నో అనుమానాస్పద సంఘటనలు, వాటి వెనుక దాగున్న చిక్కుముడులు ఇలా..ఎంతో ఆసక్తి కలిగించే అంశాలు ఉన్న ఈ సిరీస్..ఆడియన్స్కు అదిరిపోయే థ్రిల్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ వెబ్ సిరీస్కు దేబాలోయ్ భట్టచార్య డైరెక్ట్ చేయగా..అరిందమ్ మిత్ర నిర్మాతగా వ్యవహరించారు. ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు, హిందీ, తమిళం,మలయాళం,కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.