108 ఎంపీ కెమెరా ఫోన్లలో.. ఏది బెస్ట్‌‌?

108 ఎంపీ కెమెరా ఫోన్లలో.. ఏది బెస్ట్‌‌?

స్మార్ట్‌‌ఫోన్‌‌ యూజర్స్‌‌ ఎక్కువగా కెమెరాపైనే దృష్టిపెడుతున్నారు. ప్రాసెసర్‌‌‌‌, ర్యామ్‌‌, మెమరీతోపాటు కెమెరా క్వాలిటీకి ఇంపార్టెన్స్‌‌ ఇస్తున్నారు. అది కూడా బడ్జెట్‌‌లో ఉండే మంచి కెమెరా ఫోన్స్‌‌ను ఎక్కువగా వాడుతున్నారు. స్మార్ట్‌‌ఫోన్‌‌ కెమెరాల్లో లేటెస్ట్‌‌గా వచ్చింది 108 మెగాపిక్సెల్‌‌. ‘రియల్‌‌మి 8 ప్రొ’, ‘రెడ్‌‌మి నోట్‌‌ 10 ప్రొ మ్యాక్స్‌‌’ స్మార్ట్‌‌ఫోన్స్ రెండూ 108 ఎంపీ కెమెరా ఉన్న ఫోన్లే. ఈ రెండూ ఈనెలలోనే లాంఛ్అయ్యాయి. రెండూ ఇరవై వేల రూపాయల్లోపే ఉన్నాయి. ఈ రెండు ఫోన్స్‌‌లో ఉన్న ఫీచర్స్‌‌ ఏంటి? వాటి ప్రత్యేకత ఏంటి?
రియల్‌‌మి లేటెస్ట్‌‌గా లాంఛ్‌‌ చేసిన మీడియం రేంజ్ స్మార్ట్‌‌ఫోన్ ‘రియల్‌‌మి 8 ప్రొ’. ఈ కంపెనీ నుంచి రిలీజైన మొదటి 108 ఎంపీ కెమెరా ఫోన్‌‌. వరల్డ్స్‌‌ హైయ్యస్ట్‌‌ మెగాపిక్సెల్‌‌ కెమెరా ఫోన్‌‌ ఇదే అని చెప్తోంది రియల్‌‌మి. అయితే, షావోమీ కంపెనీ కూడా ఈమధ్యే ‘రెడ్‌‌మి నోట్‌‌ 10 ప్రొ మ్యాక్స్‌‌’ పేరుతో 108 ఎంపీ కెమెరా ఫోన్‌‌ లాంఛ్‌‌ చేసింది. ఈ రెండూ బడ్జెట్‌‌ రేంజ్‌‌లోనే ఉండటం విశేషం. రెండింటి ఫీచర్స్‌‌ ఇవి. రియల్‌‌మి 8 ప్రొ:, 6.4 అంగుళాల అమోల్డ్‌‌ స్క్రీన్‌‌, 720జి స్నాప్‌‌డ్రాగన్‌‌ ప్రాసెసర్‌‌‌‌, ఆండ్రాయిడ్‌‌ 11 ఓఎస్‌‌, 8.1ఎమ్‌‌ఎమ్‌‌ థిన్‌‌, 176 గ్రామ్స్‌‌,  6జీబీ/128జీబీ, 8జీబీ/128జీబీ, క్వాడ్రపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరాస్‌‌ (108 ఎంపీ మెయిన్‌‌ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌‌ యాంగిల్‌‌ కెమెరా, 5 మ్యాక్రో లెన్స్‌‌, బ్లాక్‌‌&వైట్‌‌ లెన్స్‌‌‌‌), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,500 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ వంటివి మెయిన్‌‌ ఫీచర్స్‌‌.
పర్ఫామెన్స్‌‌: కెమెరాలో న్యూ సూపర్‌‌‌‌ నైట్‌‌స్కేప్‌‌ మోడ్‌‌ ఉంది. దీనివల్ల రాత్రిపూట కూడా ఫొటోలు, వీడియోలు మరింత క్లారిటీగా వస్తాయి. ‘టిల్ట్‌‌–షిఫ్ట్‌‌ టైమ్‌‌–లాప్స్‌‌ వీడియో’ ఫీచర్‌‌‌‌ ఉన్న ఫస్ట్‌‌ ఫోన్‌‌ కూడా ఇదే. ఈ ఫీచర్‌‌‌‌ ఉపయోగించి ఫొటోలు తీస్తే, పీపుల్‌‌, సబ్జెక్ట్స్‌‌ అన్నీ మినీయేచర్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌లాగా కనిపిస్తాయి. ఇది కొత్త క్రియేటివ్‌‌ వరల్డ్‌‌లా అనిపిస్తుంది. కెమెరాకు సంబంధించి డ్యుయల్‌‌ వ్యూ వీడియో అనే మరో ఫీచర్‌‌‌‌ కూడా ఉంది. దీని ద్వారా ఒకేసారి అటు సెల్ఫీ కెమెరాతో, ఇటు ప్రైమరీ కెమెరాతో వీడియోలు తీయొచ్చు. రెండు వీడియోల్ని సగంసగం స్క్రీన్‌‌పై చూడొచ్చు. 50 వాట్స్‌‌ సూపర్‌‌‌‌ డార్ట్‌‌ చార్జ్‌‌ ద్వారా 17 నిమిషాల్లోనే యాభై శాతం చార్జ్‌‌ అవుతోందని కంపెనీ చెప్తోంది. 47 నిమిషాల్లోనే వంద శాతం చార్జ్‌‌ అవుతుంది. మంచి కెమెరా, ఫాస్ట్ చార్జింగ్‌‌ కావాలనుకునేవాళ్లకు ఈ ఫోన్‌‌ మంచి ఛాయిస్‌‌. అయితే, బ్యాటరీ కెపాసిటీ తక్కువ. ధర: సుమారు ₹ 17,999 ₹ 19,999
రెడ్‌‌మి నోట్‌‌ 10 ప్రొ మ్యాక్స్‌‌: 6.6 అంగుళాల డిస్‌‌ప్లే, స్నాప్‌‌డ్రాగన్‌‌ 732జి ప్రాసెసర్‌‌‌‌, ఆండ్రాయిడ్‌‌ 11 ఓఎస్‌‌, 6జీబీ/128జీబీ, 8జీబీ/128జీబీ, క్వాడ్రపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరాస్‌‌ (108 ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సూపర్‌‌‌‌ మ్యాక్రో, 8ఎంపీ అల్ట్రా వైడ్‌‌ యాంగిల్‌‌, 2ఎంపీ డెప్త్‌‌ సెన్సర్‌‌‌‌) 16 ఎంపీ ఇన్‌‌డిస్‌‌ప్లే సెల్ఫీ కెమెరా, 5020ఎంఏహెచ్‌‌ బ్యాటరీ (33 వాట్స్‌‌ ఫాస్ట్‌‌ చార్జర్‌‌‌‌), ట్రిపుల్‌‌ స్లాట్‌‌ ట్రే, 0.7 ఎమ్‌‌ఎమ్‌‌ థిన్నర్‌‌‌‌,192 గ్రామ్స్‌‌ పర్ఫామెన్స్‌‌: నైట్‌‌మోడ్‌‌ 2.0 ఫీచర్‌‌‌‌ ఉన్న కెమెరా కాబట్టి, రాత్రిపూట కూడా ఫొటోలు క్లారిటీగా వస్తాయి. సూపర్ మ్యాక్రో కెమెరాతో చిన్న వస్తువుల్ని కూడా బాగా తీయొచ్చు. లాంగ్‌‌ ఎక్స్‌‌పోజర్‌‌‌‌ కూడా బాగుంటుంది. ఫాస్ట్‌‌ చార్జర్‌‌‌‌తో 30 నిమిషాల్లోనే 59 శాతం బ్యాటరీ చార్జ్‌‌ అయితే, 75 నిమిషాల్లో వంద శాతం చార్జ్‌‌ అవుతుంది. డ్యుయల్‌‌ స్టీరియో స్పీకర్స్‌‌తో సౌండ్‌‌ క్లారిటీగా వినిపిస్తుంది. ధర: సుమారు ₹ 18,999 ₹ 19,999