టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆనందం ఆతనికి వారానికే పరిమితమైంది. తాజాగా ఐసీసీ బుధవారం (జూలై 10) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతను టీ20 ఆల్ రౌండర్స్ లో రెండో ర్యాంక్ కు పడిపోయాడు. జింబాబ్వే టూర్ లో రెస్ట్ తీసుకోవడంతో పాండ్య ర్యాంక్ దిగజారింది. శ్రీలంక కెప్టెన్ హసరంగా 222 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ (211), జింబాబ్వేకు కెప్టెన్ సికందర్ రజా(208) షకీబ్ అల్ హసన్(206) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. టీ20 వరల్డ్ కప్‌లో పాండ్య ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. బ్యాటింగ్ లో 144 రన్స్.. బౌలింగ్ లో 11 వికెట్లు పడగొట్టాడు. ఇక బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు వెనకపడ్డారు. అక్షర్ పటేల్ రెండు స్థానాలు దిగజారి 9 ర్యాంక్ లో ఉన్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు దిగజారి 10 వ ర్యాంక్ లో నిలిచాడు.
వరల్డ్ కప్ లో 2024 లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న బుమ్రా 14 స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ అదిల్ రషీద్ తన టాప్ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ నోకియా వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కారణంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నెంబర్వన్ ర్యాంక్ లో ఉన్నాడు. టీమిండియా స్టార్ సూర్య కుమార్ యాదవ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్ అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్ టాప్ 10 లో చోటు దక్కించుకొని 7 వ స్థానంలో కొనసాగుతున్నాడు.
Sri Lanka's Wanindu Hasaranga has reclaimed the top spot in the latest ICC T20I all-rounders rankings, pushing Hardik Pandya into second place. pic.twitter.com/HZWhecqJnO
— CricTracker (@Cricketracker) July 10, 2024