కన్నడ స్టార్ శ్రీమురళి, రుక్మిణి వసంత్ జంటగా డాక్టర్ సూరి డైరెక్ట్ చేసిన కన్నడ చిత్రం ‘బఘీర’ (Bagheera). దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను అందించగా, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.
దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ తెలుగులో రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా కాస్తా ఫర్వాలేదనిపించింది.
బఘీర ఓటీటీ:
భారీ అంచనాల మధ్య రిలీజైన బఘీర మూవీ 3 వారాలకే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ మూవీ గురువారం (నవంబర్ 21) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, తమిళ భాషల్లో ఆడియో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
బఘీర కథ:
ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడంతో భారీ అంచనాల మధ్య రిలీజయింది. కానీ, కథనంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. కేజీఎఫ్, సలార్ స్థాయిలో బఘీరలో ఎమోషన్స్ వర్కవుట్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు వసూళ్లను మాత్రమే ఈ మూవీ దక్కించుకుంది.
పోలీస్ ఆఫీసర్ అయిన హీరో.. తన యూనిఫామ్ను పక్కన పెట్టి.. ఆ ప్రాంతంలోని క్రిమినల్స్ని.. ఓ ముసుగు వేసుకుని చంపుతుంటాడు. అత్యంత పాశవికంగా అతను చేసే హత్యలు చూసి డిపార్ట్ మెంట్ హైయర్అథారిటీ కూడా షాక్ అవుతుంది.
ALSO READ | వర్మను వదలని పోలీసులు.. విచారణకు రావాలంటూ ఆర్జీవీకి మరోసారి నోటీసులు
దాంతో హైయర్అథారిటీస్ అతనిపై పరిమితులు విధిస్తారు. ఇక ఏం చేయలేని స్థితిలో ఉన్న హీరో తన కళ్ల ముందు జరుగుతున్న నేరాల్ని కూడా పట్టించుకోవడం మానేస్తాడు. అంతేకాకుండా తనకు దక్కిన పోలీసు ఉద్యోగం కోసం తన తండ్రి రూ.50లక్షలు లంచం ఇచ్చినట్లు తెలుసుకుని తీవ్రంగా కుంగిపోతాడు. ఇక ఆ తర్వాత రాత్రి పూట బఘీర అనే సూపర్ హీరోగా క్రిమినల్స్‌ను వేటాడటం మొదలు పెడతాడు. ఇలాంటి సమయంలో అతనికి ఎదురైనా సవాళ్లేంటీ? అనేది మిగతా స్టోరీ.