హేషమ్ అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab)..ఈ పేరు ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ నోటా ఫేమస్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా, ఆడియో ఇంజనీర్ గా సత్తా చాటుతున్నారు. 2022 మలయాళంలో వచ్చిన హృదయం మూవీతో ఎంట్రీ ఇచ్చారు. లేటెస్ట్ గా డైరెక్టర్ శివ నిర్వాణ.. విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న'ఖుషి'(Khushi) మూవీకు మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ మూవీలో నుంచి రిలీజైనా సాంగ్స్ ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నాయి. అబ్దుల్ వాహబ్ స్వరపరిచిన సాంగ్స్ మెలోడియస్ ఫిల్ తో ప్రతి ప్రేక్షకుడి గుండెకు హత్తుకుంటున్నాయి. నా రోజా నువ్వే, ఖుషి టైటిల్ ట్రాక్.. మ్యూజిక్ తో పాటు తన గొంతును కూడా వినిపించి ఆడియన్స్ నోటా వావ్ అనిపించుకుంటున్నారు. దీంతో హేషమ్ అబ్దుల్ వహాబ్ టాలీవుడ్ లో బాగా ఫేమస్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. అలాగే మరో ఎ ఆర్ రెహమాన్ అవుతాడని అంటున్నారు సినీ ఆడియన్స్.
రీసెంట్ గా నాని 30వ మూవీ 'హాయ్ నాన్న', శర్వానంద్ 35 మూవీ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. కామన్ గా స్టార్ హీరోమూవీ అనగానే.. ఎస్ ఎస్ థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఇలాంటి టైం లో వస్తోన్న ఒక ఫీల్ అండ్ ఫ్రెష్ మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తోన్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ను ఆడియన్స్ కోరుకుంటున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం తన నుండి రాబోతున్న నాని, శర్వా మూవీ ఆల్బమ్స్ హిట్ అయితే కనుక ..సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ జాబితాలో చేరడం కన్ఫర్మ్ అంటున్నారు ఆడియన్స్. సౌదీ కి చెందిన హేషమ్ వహాబ్ చిన్న వయసులోనే పియానోతో సంగీత కళాకారుడిగా గుర్తింపు దక్కించుకుని, కెరీర్ స్టార్టింగ్ లోనే హృదయం మూవీతో కేరళ ప్రభుత్వం నుంచి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు పొందారు. దీంతో హేషమ్ అబ్దుల్ వహాబ్ పలు భాషల్లో కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.