24గంటలు ప్రజలకుఅందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే వివేక్ వింకటస్వామి

ప్రజలకు ఎప్పూడు అందుబాటులో ఉంటానని.. ఫోన్ చేస్తే చాలు మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి తో కలిసి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లో క్రిస్ మస్ వేడుకల్లో పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ సీఎస్ ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామిలకు అపూర్వ స్వాగతం పలికారు స్థానికులు. 

ఈసందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో 24 గంటలు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఫోన్ చేసిన ప్రతి వ్యక్తికి రెస్పాన్స్ ఇస్తానని చెప్పారు. ప్రజా సమస్యలకు కృషి చేస్తానని చెప్పారు.